Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''రంగస్థలం''లో యువరాజుగా మగధీర.. రాజమహల్‌లో షూటింగ్

బుధవారం, 27 డిశెంబరు 2017 (13:06 IST)

Widgets Magazine

మగధీర రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''రంగస్థలం''. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది.1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.

అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా, ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ ఇందులో కనిపించనుంది. తొలిసారిగా రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా నటిస్తుండటంతో పాటు ఫుల్ మాస్ లుక్‌లో విడుదలైన ఫస్ట్ లుక్‌ మెగాఫ్యాన్స్‌లో అంచనాలను మరింత పెంచాయి.
 
ఈ నేపథ్యంలో చెర్రీ ఈ సినిమాలో పల్లెటూరి యువకుడిగా ఓ పాత్రలో కనిపిస్తూనే.. యువరాజుగానూ మెప్పిస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రంగస్థలం సినిమా మార్చి 30వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం రాజస్థాన్‌లో ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో చెర్రీపై యువరాజుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారట. 
 
ఈ సినిమాలో చరణ్ రాజవంశస్థుడిగా కనిపించనున్నాడట. అందువల్లనే రాజస్థాన్‌లోని 'రాజమహల్'లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. రాజమహల్‌లో ఇప్పటికే 30 శాతం చిత్రీకరణను జరపనున్నట్టు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

5 నిమిషాలకు 5 కోట్లు.. అది నా కష్టానికి ప్రతిఫలం.. విచారణ సిగ్గుచేటు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయి.. ప్రపంచ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన భారతీయ నటి ...

news

మిడిల్ క్లాస్ అబ్బాయిలో డిలీట్ చేసిన సీన్లు ఇవే (వీడియో)

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎంసీఏ ...

news

'బీబోయ్' కండోమ్‌లను విరుష్క జంట వాడి అనుభవం చెప్పాలి : రాఖీ సావంత్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోమారు నోరుపారేసుకున్నారు. ఈమె ...

news

రష్యన్ భాషలో 'బాహుబలి' .. దుమ్ముదులిపిన ట్రైలర్స్ (వీడియో)

భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు భాగాలుగా ...

Widgets Magazine