Widgets Magazine

సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా జగపతిబాబు.. ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా?

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (18:32 IST)

బాలీవుడ్ న‌టుడు సల్మాన్ ఖాన్ కృష్ణ‌జింక‌ను వేటాడిన కేసు నుంచి బెయిల్‌పై వచ్చిన నేపథ్యంలో..  సల్మాన్ ఖాన్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక సల్మాన్ చేసే సినిమాలో ఆయనకు విలన్‌గా జగపతిబాబు నటించబోతున్నారట. రంగస్థలం సినిమా తరువాత తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని నటుడు జగపతిబాబు రంగస్థలం విజయోత్సవ సభలో తెలిపిన సంగతి తెలిసిందే. 
 
కాగా ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ దబాంగ్-3లో నటించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇందులో విలన్‌గా జగపతి బాబును ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు కృష్ణజింక వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వార్త ఫాన్స్ మిగతా ఫామిలీ అంటే ఈ విషయం ఎక్కువగా న‌టి కత్రినాకైఫ్‌ను కలచివేసింది. సల్మాన్‌ ఎలాగైనా బయటకి రావాలని కత్రినా ప్రత్యేక పూజలు చేయించింది. 
 
దాదాపు 48 గంట‌ల పాటు జైలులో వున్న సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు జోధ్ పూర్ జైలు నుండి బెయిల్ మీద బయటికి రావడంతో కత్రినా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే కత్రినా కైఫ్ సల్మాన్ ఇంటికి చేరుకుందట. గంటల పాటు సల్మాన్ ఖాన్‌తోనే ఆమె గడుపుతుందట. దీంతో బిటౌన్‌లో సల్మాన్, కత్రినా కైఫ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని సినీ పండితులు చెప్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''భరత్ అనే నేను'' ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అదిరిపోతాయట.. బాహుబలి-2కి?

కొరటాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ...

news

శ్రీరెడ్డికి మద్దతు.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అన్న అపూర్వ.. వర్మ ఏమన్నారంటే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ...

news

నాకూ అలాంటి పరిస్థితి ఎదురైంది.. ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే?: పూనమ్ కౌర్

టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా ...

news

కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడెందుకు లెండి.. మళ్లీ మాట్లాడుతా: కొరటాల శివ

టాలీవుడ్‌ని క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ ...