Widgets Magazine

ఎన్టీఆర్ 'టెంపర్' చిత్ర రీమేక్‌లో అతిలోక సుందరి కుమార్తె!

చిత్రపరిశ్రమ అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రీదేవి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ "దఢక్" చిత్రంలో వెండితెర అరంగేట్రం చేసింది.

jhanvi kapoor
pnr| Last Updated: శనివారం, 27 జనవరి 2018 (13:20 IST)
చిత్రపరిశ్రమ అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రీదేవి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ "దఢక్" చిత్రంలో వెండితెర అరంగేట్రం చేసింది. షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్‌తో జాన్వీ ఈ చిత్రంలో జతకట్టింది. జూలై 20న విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ మరాఠి చిత్రం 'సైరత్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతుంది.

'దఢక్' చిత్రం శశాంక్ కైతాన్ దర్శకత్వంలో రూపొందుతుండగా, ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో జాన్వీని చూసిన ప్రతి ఒక్కరు అచ్చం శ్రీదేవిలానే ఉందని ప్రశంసలు కురించారు. మరోవైపు దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి ఆఫర్స్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ "టెంపర్"ని హిందీలో రోహిత్ శెట్టి రీమేక్ చేయనుండగా, ఇటీవల చిత్ర టైటిల్‌తో ఫస్ట్ లుక్‌తో పోస్టర్ విడుదల చేశారు. "సింబా" అనే టైటిల్‌తో మూవీ రూపొందనుంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీని తీసుకోవాలని నిర్మాత భావిస్తున్నారట.


దీనిపై మరింత చదవండి :