Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శత"కోటి" వందనాలంటున్న 'జై లవ కుశ'

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:36 IST)

Widgets Magazine

జూ.ఎన్టీఆర్ హీరోగా, త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం‌పై ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. పైగా, ఈ చిత్రంలో మూడు పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసినా అందులో 'జై' పాత్ర గురించే అంతా చర్చ. రెండు పాజిటివ్‌ పాత్రలతో ఓ నెగిటివ్‌ క్యారెక్టర్‌ను ఎలా తీర్చిదిద్దారో చూడాలనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోయింది. 
 
"అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు..., ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రె.. రె.. రెడీ" అంటూ నత్తితో జై పాత్రలో ఎన్టీఆర్‌ తనదైన శైలిలో పలికిన డైలాగ్‌లకు ప్రశంసలు కురిపిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది. తాజాగా కోటి వ్యూస్‌ను దాటేసింది. 
 
అతితక్కువ సమయంలో కోటి వ్యూస్‌ను తమ చిత్రం ట్రైలర్‌ సొంతం చేసుకుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. ''జై లవకుశ' ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. గతంలో చెప్పినట్లుగానే.. నా నటనతో మీ అందరూ (అభిమానులు) తృప్తి చెందే విధంగా కష్టపడతా' అని అన్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా, రాశీ ఖన్నా, నివేదా థామస్‌‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కమల్ హాసన్ కొత్త పార్టీ... దసరా రోజు ప్రకటన?

విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆయన దసరా పండుగ ...

టాలీవుడ్ నటుడి భార్య మృతి...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిన్న భార్య శిరీష (42) చనిపోయింది. గత కొంతకాలంగా ...

news

'కత్తి'కి సంపూ అది పెట్టేశాడు... ఖుషీగా పవన్ ఫ్యాన్స్

కొంతమంది నటులు మాట్లాడితే చాలు మహా ఖుషీగా వుంటుంది. ఇప్పుడు నటుడు సంపూర్ణేష్ బాబు చేసిన ...

news

వయసులో పెద్దదయినా అనుష్క ఇంకా...

తెలుగు సినీ హీరోయిన్లు సాధారణంగా వయస్సు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. 35 సంవత్సరాలు ...

Widgets Magazine