మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 7 సెప్టెంబరు 2017 (20:49 IST)

రాయలసీమ, ప్రకాశం జిల్లా దుర్భిక్ష నివారణకు 75 మిలియన్ డాలర్లు

అమరావతి: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి (IFAD), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం ఈరోజు ఢిల్లీలో జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యవసాయ శాఖకు స

అమరావతి: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి (IFAD), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం ఈరోజు ఢిల్లీలో జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యవసాయ శాఖకు సుమారు 500 కోట్ల ఋణం అందనున్నట్లు, రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ శాఖకు అంతర్జాతీయ సంస్థతో ఇదే తొలి ఒప్పందమని తెలిపారు. 
 
పై ఐదు జిల్లాలలో వర్షాభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు, దీనికి మరో రూ .500 కోట్లను నాబార్డు, నరేగా కార్యక్రమం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపు చెయ్యాలని ఒప్పందంలో భాగంగా వున్నదని తెలిపారు. ఈ ఒప్పందం వలన రాష్ట్రంలోని నాలుగు రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిలాలోని ఒక లక్షా 65 వేల కుటుంబాలకు ఉపయోగ పడనున్నదని చెప్పారు.
 
లక్షా 65 వేల కుటుంబాలకు ఆదాయం పెంపుదలకు, వర్షాభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు పలు అవకాశాలు కల్పించదానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. ఒప్పందం ప్రకారం ఐదు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అక్కడి ప్రజలకు సాంకేతిక అంశాలపై స్థానిక కమ్యూనిటీ సంస్థలతో కలిసి అవగాహన, శిక్షణా వంటి కార్యక్రమాలతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు, గొర్రెలు, మేకల పెంపకం ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఆయా కుటుంబాలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.  
 
25 ఎళ్ల కాల పరిమితి, 5ఏళ్ళ గ్రేస్ తో మొత్తం 30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. గత సంవత్సర కాలంగా IFADతో  రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిందన్నారు. ఇవాళ కేంద్ర ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే సమక్షంలో IFAD ప్రతినిధి ఆశా ఒమర్, రాష్ట్రం తరపున వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా తాను ఒప్పంద పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారు.