మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (14:00 IST)

38మందిపై టోబాక్ లైంగిక వేధింపులు: మా ముందే హస్త ప్రయోగం.. రెచ్చగొట్టేలా?

ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ గ్రహీత జేమ్స్ టోబాక్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. ప్రముఖ నిర్మాత వెయిన్ స్టీన్‌పై లైంగిక ఆరోపణలు ముగియకముందే మరో దర్శకుడైన జేమ్స్ టోబాక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇ

ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ గ్రహీత జేమ్స్ టోబాక్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. ప్రముఖ నిర్మాత వెయిన్ స్టీన్‌పై లైంగిక ఆరోపణలు ముగియకముందే మరో దర్శకుడైన జేమ్స్ టోబాక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వెయిన్‌స్టీన్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి-దర్శకురాలు ఏషియా అర్జెంటోతో పాటు పలువురు టోబాక్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన మహిళలకు ఆన్‌లైన్‌లో మద్దతు ప్రకటించారు. 
 
ఇప్పటికే #MeeToo అనే హాష్ ట్యాగ్‌తో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ టోబాక్ ఏకంగా 38మంది మహిళలు ఆరోపించారు. న్యూయార్క్‌ స్ట్రీట్‌లో తమను టోబాక్ కలిసి, సినిమాల్లో స్టార్‌డమ్‌ కల్పిస్తానని ఆశ చూపేవాడని బాధిత మహిళలు ఆరోపించారు. 
 
జేమ్స్‌త జరిగిన సమావేశాలు చాలాసార్లు లైంగిక అంశాలతోనే ముగిసేవని, కొన్నిసార్లు తమకు ముందే అతను హస్తప్రయోగ చర్యకు పాల్పడేవాడని, లేకుంటే లైంగిక చర్యకు రెచ్చగొట్టేలా ప్రవర్తించేవాడని పలువురు గుర్తుచేసుకున్నారు. అయితే 72ఏళ్ల టోబాక్ ఆరోపణలను తిరస్కరించారు. టోబాక్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 38మందిలో 31మంది మహిళలు ఆన్‌ రికార్డు మాట్లాడారు. 
 
అంతేగాకుండా టోబాక్ కథనం వెలువడిన కాసేపటికే అతనిపై ఆరోపణలు చేసిన మహిళల సంఖ్య రెట్టింపైంది. ఈ కథనం తర్వాత మరింత మంది ముందుకొచ్చి అతని ఆగడాలను బయటపెడుతున్నారని టైమ్స్‌ రిపోర్టర్‌ గ్లెన్‌ విప్‌ తెలిపారు.