శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (11:11 IST)

'జిమిక్కి కమ్మల్' పాటకు సుమ డ్యాన్స్ అదిరిపోయింది....

ఓనం పండుగ స్పెష‌ల్‌గా కేర‌ళలోని కొచ్చిలో ఉన్న‌ ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ కామ‌ర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన 'జిమిక్కి క‌మ్మ‌ల్' డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఓనం పండుగ స్పెష‌ల్‌గా కేర‌ళలోని కొచ్చిలో ఉన్న‌ ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ కామ‌ర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన 'జిమిక్కి క‌మ్మ‌ల్' డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఓనం పండుగ సంద‌ర్భంగా వాళ్లు చేసిన వీడియో కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్న‌ది. ఆగ‌స్టు 30వ తేదీన రిలీజ‌ైన ఈ వీడియో సాంగ్‌ను ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 1.30 కోట్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు. 
 
ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్‌లాల్ న‌టించిన‌ "వెలిప‌డింతె పుస్త‌కం" అనే సినిమాలోని ఈ సాంగ్ మంచి పాపులర్ అయింది. ఈ పాటకు డ్యాన్స్ చేసిన వారి జాబితాలో బుల్లితెర యాంకర్ సుమ కనకాల కూడా చేరిపోయింది. ఈమె కూడా ఈ పాటకు స్టెప్పులేసింది. బాగా మాట్లాడ‌ట‌మే కాదు తనకు బాగా డ్యాన్స్ కూడా చేయ‌గ‌ల‌న‌ని నిరూపించింది. ఆ వీడియోనూ మీరూ చూడండి.