Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కమ్యూనిస్టులతో కమల్ హాసన్ దోస్తీ...

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:32 IST)

Widgets Magazine
kamal

విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. గాంధీ జయంతి రోజునో లేక దసరాకు కమల్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కమల్ ప్రతిపక్ష డిఎంకేతో జతకట్టి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఈ పార్టీతో కలవడం కన్నా సొంతంగా పార్టీ నడుపుకుంటేనే మంచిదన్న కొంతమంది సన్నిహితుల సలహాలతో కమల్ హాసన్ వెనక్కి తగ్గారు. 
 
ప్రజలతో కలిసి.. ప్రజా సమస్యలపై పోరాడే వారితోనే ముందుకెళ్ళాలనుకున్న నిర్ణయానికి వచ్చారు కమల్. అందుకే కమ్యూనిస్టులను ఎంచుకున్నారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. సమస్య అంటే వాలిపోయే కమ్యూనిస్టులు తనకు సరిగ్గా సరిపోతారన్నది కమల్ ఆలోచన.
 
అందుకే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టే ముందు కమ్యూనిస్టులతో కలిసి ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఢిల్లీలోని కమ్యూనిస్టులు నేతలు సిపిఐ, సిపిఎంలతో ఇప్పటికే కమల్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ ప్రారంభించిన వెంటనే కమ్యూనిస్టులతో తాను జతకట్టే విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు తెలుపనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ఏ విధంగా రాణించనున్నారో మరికొన్నిరోజుల్లో తేలిపోనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జై లవ కుశలో స్వింగ్ జరా అంటున్న తమన్నా.. హాట్ లుక్ చూడండి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ...

news

చంపేస్తామని బెదిరిస్తున్నారు... అయినా బెదిరిపోను : కమల్ హాసన్

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ...

news

టాలీవుడ్ లవబర్డ్స్ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు వీరే..!

టాలీవుడ్ ప్రేమపక్షులు చైతూ సమంత. వీరిద్దరి వివాహం వచ్చే ఆరో తేదీన గోవాలో జరుగనుంది. ...

news

స్పైడర్‌లో మహేష్ బాబు దుమ్ముదులిపేసాడు... (SPYDER TRAILER)

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ...

Widgets Magazine