శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (09:04 IST)

హీరో నిఖిల్ "కిర్రాక్ పార్టీ" ట్రైలర్ అదిరిపోయింది...

యువ హీరో నిఖిల్ తాజా చిత్రం "కిర్రాక్ పార్టీ". సంయుక్త, సిమ్రాన్ పరీంజా హీరోయిన్లు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

యువ హీరో నిఖిల్ తాజా చిత్రం "కిర్రాక్ పార్టీ". సంయుక్త, సిమ్రాన్ పరీంజా హీరోయిన్లు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇక చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో నాగచైతన్య తన సోషల్ మీడియా పేజీలో విడుదల చేశారు. ఇప్పటికే ప్రమోషన్ పరంగా దూసుకుపోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇక ఈ ట్రైలర్‌లో ఉన్న విషయానికి వస్తే.. మెయిన్ యూత్‌ని టార్గెట్ చేస్తూ వస్తున్న చిత్రంగా అనిపిస్తుంది. జూనియర్స్, సీనియర్స్ మధ్య జరిగే ర్యాగింగ్ నుంచి.. మంచి కామెడీ పంచ్‌లతో, నవ్వించుకుంటూ అసలైన కథలోకి సినిమా వెళ్లేలా స్క్రీన్‌ప్లే నడిచినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా నిఖిల్ ఎనర్జీ సూపర్బ్ అనేలా ఉంది. మొత్తంగా వినూత్నంగా కథలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌ 'కిర్రాక్ పార్టీ'తో మరో సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.