శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:54 IST)

కోలీవుడ్‌లో విషాదం : నటుడు ఆనంద్ కణ్ణన్ మృతి

తమిళ చిత్ర సీమలో విషాదం చోటుచేసుకుంది. సన్ మ్యూజిక్ ఆరంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీజే, నటుడు ఆనంద కణ్ణన్ సోమవారం రాత్రి మృతి చెందారు. ఈయన గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ వచ్చారు. ఈ విషయాన్ని తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
 
సింగపూర్ తమిళియన్ అయిన ఆనంద 90వ దశకంలో కోలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ నటుడు. సన్ టీవీ సిరీస్ సింధ్‏బాద్‏లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతను ఆకట్టుకున్నారు. అయితే, వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం విషమించడంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆనంద్ కణ్ణన్ మృతితో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.