శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (10:36 IST)

అల్లు శిరీష్‌కు విలన్‌గా మారిన దాసరి అరుణ్ కుమార్

అల్లు శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కించే సినిమాలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ విలన్‌గా కనిపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలం క్రితం హీరోగా అరంగేట్రం చేసినా.. క

అల్లు శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కించే సినిమాలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ విలన్‌గా కనిపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలం క్రితం హీరోగా అరంగేట్రం చేసినా.. కథానాయకుడిగా అతనికి మంచి సక్సెస్ రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. అవి కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాడు.
 
తాజాగా విలన్ రోల్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ పాత్ర ద్వారా తనకు గుర్తింపు లభిస్తుందని అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. ఎక్కడికి పోతావు చిన్నదానా ఫేమ్ వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అల్లు శిరీష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.