పవర్ స్టార్‌ పవన్‌తో ప్రఖ్యాత దర్శకుడి భార్య...

ఆదివారం, 3 డిశెంబరు 2017 (16:44 IST)

lissy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు అలనాటి అందాల తార లిజీ నటించనున్నారు. ఈమె సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని లిజీ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న లిజీ తన భర్త ప్రియదర్శన్‌తో విడిపోయాక సినిమాలకు దూరమయ్యారు. తెలుగులో 'మగాడు', '20వ శతాబ్దం'లాంటి హిట్ సనిమాల్లో నటించారు.
 
తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి లిజీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఓ కామెంట్స్ పెట్టారు."నేను మళ్లీ సినిమాల్లో నటిస్తానా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను. పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. అలాగే, నితిన్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత న్యూయార్క్‌లో జరుగుతున్న చిత్రీకరణలో కెమెరా ముందుకు వచ్చాను. 
 
భయంగా అనిపించింది కానీ థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ అనుభవాన్ని మిస్‌ అయ్యాననే చెప్పాలి. అమెరికాలో సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తిచేశాం. రెండో షెడ్యూల్‌ కునూర్‌లో చేయనున్నాం. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 22 ఏళ్ల వయసులో నాకు అవకాశాలు వస్తున్న సమయంలో చిత్ర పరిశ్రమను వదులుకోవడం నేను సరిదిద్దుకోలేని తప్పు. ఆ క్షణాలను మళ్లీ తీసుకురాలేను. కాబట్టి సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనైనా మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నాను. మీరంతా సపోర్ట్‌ చేసినందుకు ధన్యవాదాలు" అని లిజీ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  
Lissy Act Decades Priyadarshan Pawar Star Movie Priyadarshans Ex Wife

Loading comments ...

తెలుగు సినిమా

news

తప్పతాగి.. కారు కింద నక్కిన హాస్యనటుడు...

పీకల వరకు మద్యం సేవించి, కారు డ్రైవ్ చేస్తూ వచ్చి పోలీసులకు చిక్కాడు. అయితే, ఖాకీలకు ...

news

#OkkaKshanam టీజర్ : లవ్ వర్సెస్ డెస్టినీ

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న దర్శకుడు వీఐ ఆనంద్. ఈయన రెండో ...

news

శ్రీముఖి అందాలను జుర్రుకున్నానంటున్న నందు

నందు, శౌర్య, శ్రీముఖి, రోషిణి ప్రధాన పాత్రల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్‌పై ధ‌న జమ్ము ...

news

నిత్యతో 'అ'లా మొదలైందంటున్న హీరో నాని

చూడగానే ఆకట్టుకునే ఫేస్‌తో కైపైన చూపుతో యూత్‌ని ఇట్టే ఆకర్షించే మలయాళ కుట్టి నిత్యా ...