మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 28 మే 2018 (21:41 IST)

ట్విట్టర్‌లో మహేష్ బాబు ఎవ‌రెవ‌ర్ని ఫాలో అవుతున్నారో తెలుసా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తన ట్విట్టర్ ఫాలోయింగ్‌ను విస్తరించాడు. మహేష్ బాబు ట్విట్టర్ ఖాతాను నిన్నటివరకూ 65 లక్షల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం తన బావ గల్లా జయదేవ్, దర్శకుడు కొరటాల శివను మాత్రమే ఫాలో అవుతున్నాడన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తన ట్విట్టర్ ఫాలోయింగ్‌ను విస్తరించాడు. మహేష్ బాబు ట్విట్టర్ ఖాతాను నిన్నటివరకూ 65 లక్షల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం తన బావ గల్లా జయదేవ్, దర్శకుడు కొరటాల శివను మాత్రమే ఫాలో అవుతున్నాడన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే... ఇప్పుడు మహేష్ బాబు ఫాలో అవుతున్న వారి సంఖ్య 2 నుంచి 8కి పెరిగింది. 
 
దిగ్గజ దర్శకుడు రాజమౌళి, భారతరత్న సచిన్‌ టెండూల్కర్, ప్రముఖ క్రికెటర్లు మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, రచయిత టోనీ రాబిన్స్‌‌లను ఆయన ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న ఆయన, వచ్చే నెల 9న తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా మ‌హేష్ బాబుకి 25వ సినిమా కావ‌డం విశేషం.