కావ్యమాధవన్‌తో దిలీప్ వివాహేతరసంబంధం.. అందుకే ఆ నటిపై?

శుక్రవారం, 24 నవంబరు 2017 (13:54 IST)

సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌పై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. గత ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకుని... స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో సిట్ అధికారులు బలమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేశారు. 
 
ఈ ఛార్జీషీట్‌లో దిలీప్ రెండో భార్య మంజు వారియర్‌తో బాధితురాలికి మంచి స్నేహం వుందని.. అయితే దిలీప్ వ్యహారంలో తేడా కనిపించడంతో పాటు వారి దాంపత్యంలో ఏర్పడిన విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కావ్యమాధవన్‌‌తో దిలీప్‌కు ఉన్న వివాహేతర సంబంధాన్ని బాధితురాలు పూర్తి ఆధారాలతో బట్టబయలు చేయడంతోనే కక్ష పెంచుకున్న దిలీప్.. పల్సర్ సునీ సాయంతో దారుణానికి ఒడిగట్టినట్లు ఛార్జీషీట్‌లో సిట్ పేర్కొంది. 
 
ఈ కేసులో పల్సర్ సునీని తొలి ముద్దాయిగా, దిలీప్‌ను ఎనిమిదో ముద్దాయిగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా తొలి సాక్షిగా బాధితురాలి పేరును సిట్ పేర్కొంది. మంజు వారియర్, కావ్యమాధవన్‌తో పాటు మాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో 50 మందిని కూడా ఛార్జీషీట్‌లో సాక్షులుగా సిట్‌లో పేర్కొంది. అంతేగాకుండా దిలీప్ పల్సర్ సునీకి కిడ్నాప్, లైంగిక వేధింపుల ప్లానుకు రూ.1.5కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష

నంది అవార్డులు ఇవ్వడంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రముఖ ...

news

రామ్ గోపాల్ వర్మ- నాగార్జున సినిమాలో దేవసేన

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కే కొత్త ...

news

నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను: వేణు మాధవ్

సినిమాలకు దూరమై.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి దిగిన హాస్య నటుడు ...

news

నెపోలియన్‌ రివ్యూ రిపోర్ట్: నా నీడపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లెంట్..

ఈ కథ మైండ్‌గేమ్‌తో సాగేది. సామాన్యుడికి కాస్త కన్‌ఫ్యూజ్‌గానూ వుంటుంది. కానీ ఇలాంటి ...