శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (14:09 IST)

'నవాబ్' దర్శకుడు మణిరత్నంకు బాంబు బెదిరింపు...

స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆయన తాజాగా నిర్మించిన చిత్రం "నవాబ్". తమిళంలో "చెక్క చివంద వానం" అనే పేరుతో నిర్మించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. పైగ

స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆయన తాజాగా నిర్మించిన చిత్రం "నవాబ్". తమిళంలో "చెక్క చివంద వానం" అనే పేరుతో నిర్మించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఈ నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ చిత్రంలోని కొన్ని అభ్యంతరకరమైన సంభాషణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, లేకుంటే బాంబు దాడి తప్పదని అజ్ఞాత వ్యక్తులు మణిరత్నం ఆఫిసుకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన ఆఫీస్ సిబ్బంది చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.