Widgets Magazine

అందంతో పనిలేదు.. అమీర్‌తో నటించాలనుంది: మానుషీ చిల్లర్

మంగళవారం, 28 నవంబరు 2017 (10:01 IST)

అందాల పోటీల్లో గెలిచిన భామలందరూ సినీ అరంగేట్రం చేయడం మామూలే. తాజాగా 17 ఏళ్ల తర్వాత భారత దేశానికి మిస్ వరల్డ్ కిరీటం సంపాదించిపెట్టిన మానుషి చిల్లర్ కూడా తనకు సినిమాల్లో రావాలనే కోరికను వెల్లడించింది. బాలీవుడ్‌లో నటించాల్సి వస్తే మాత్రం మిస్టర్ ఫర్‌ఫెక్ట్  అమీర్ ఖాన్ సరసన నటించాలని చిల్లర్ వెల్లడించింది.

పనిలో పనిగా అమీర్ ఖాన్‌ వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడని.. ప్రతి సినిమాలో వెరైటీ వుండేలా చూసుకుంటాడని తెలిపింది. ఇక అమీర్ ఖాన్ సినిమాలో సందేశం దాగివుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్‌ నటీనటులంతా ఇష్టమేనన్న మానుషి చిల్లర్.. అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా తన అభిమాన నటీనటులని తెలిపింది. 
 
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 20 ఏళ్ల మెడికల్ స్టూడెంట్. ఈమె శనివారం మిస్ వరల్డ్ 2017గా ఎంపికైంది. ఈ సందర్భంగా మీడియో అడిగిన ప్రశ్నలకు మానుషి చక్కగా సమాధానమిచ్చింది.

మిస్ వరల్డ్ కిరీటాన్ని తమ దేశానికి చెందిన యువతులు కూడా సులభంగా గెలుచుకుంటారని చెప్పుకుంటున్న పాకిస్థాన్ వ్యాఖ్యలపై మానుషి చిల్లర్ స్పందిస్తూ.. అందం ఇక్కడ ముఖ్యం కాదని, ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించినా.. ప్రపంచానికి మొత్తానికి ఏ విధంగా దోహదపడ్డామన్నదే ముఖ్యమని తెలిపింది.
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Pakistan Women Win Manushi Chillar Miss World 2017 Amir Khan Bollwood

Loading comments ...

తెలుగు సినిమా

news

పరుచూరి పలుకులు : జీవితంలో ఒక్కరికైనా సాయపడదాం.

మీ జీవితంలో మీరు నిలబడటానికి యెంత శ్రమ పడ్డారు అన్నదానికంటే, ఇంకొక వ్యక్తి నిలబడటానికి ...

news

అతన్ని కలిసిన తరువాతనే నా దశ తిరిగింది - మెహరీన్

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మెహరీన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మెహరీన్ ...

news

అమ్మతోడు.. తాగి డ్రైవ్ చేయలేదు : హీరో రాజశేఖర్

ఇటీవల హీరో రాజశేఖర్ హైదరాబాద్ నగరంలో కారు యాక్సిడెంట్ చేసిన విషయంతెల్సిందే. దీనిపై ...

news

పద్మావతిని అతను స్వయంగా చూశాడా? కర్ణిసేన వక్రీకరిస్తుందా? బాలీవుడ్ సపోర్ట్

పద్మావతి సినిమాకు మద్దతు ప్రకటించేందుకు బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు ...