శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (17:02 IST)

పాకిస్థాన్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీల్లేదు...

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు నిరాకరించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు నిరాకరించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్వేచ్ఛ ప్రసాదించిన తర్వాతి రోజే పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. వచ్చే యేడాది భారత్‌లో జరుగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశం కంటే క్రికెట్ గొప్పది కాదని, దేశం తర్వాతే ఏదైనా అని తేల్చి చెప్పారు. క్రీడా మంత్రిత్వ శాఖ కూడా భారత్‌కు పాక్ వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొంది. పాక్‌కు అనమతి ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో తటస్థ వేదికపై ఆసియాకప్‌ను నిర్వహించే విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సమాలోచలు జరుపుతోంది.