Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన... విస్తరణలో వారికే పెద్దపీట

శనివారం, 2 సెప్టెంబరు 2017 (12:27 IST)

Widgets Magazine
amit - modi

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం రాష్ట్రపతి భవన్‍కు సమాచారం చేరవేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రక్షాళన చేపట్టనున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రుల్లో 8 మందికి ఉద్వాసన పలికి.. కొత్తగా 10 మందిని చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణ ఆదివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు. 
 
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా, ఇప్పటికే కొంత మంది మంత్రులు రాజీనామాలు చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కొత్తగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం 8 మంది మంత్రులు ఉద్వాసనకు గురికాబోతున్నారు. అయితే ఈ జాబితాలో తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. దత్తాత్రేయ ఆశించిన విధంగా పని చేయకపోవడం వల్లే మోడీ ఆయనకు ఉద్వాసన చెప్పాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే.. కొత్తగా 10 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే 8 మంది శాఖల్లో మార్పులకు ఛాన్స్ ఉందని సమాచారం. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. ఈ రేసులో ఏపీ బీజేపీ చీఫ్, విశాఖ ఎంపీ హరిబాబు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొత్తగా ఎన్డీయే గూటిలో చేరిన జేడీయూకి కేంద్ర కేబినెట్‌లో రెండు బెర్తులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీకి సన్నిహితమవుతున్న ఎన్సీపీ కూడా కేంద్ర కేబినెట్‌లో చేరొచ్చునని చెబుతున్నారు. తమిళనాడులోని అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేకు కూడా రెండు మంత్రిపదవులను కట్టబెట్టనున్నారు. 
 
ఈ రెండు శాఖలను కూడా పళనిస్వామి, పన్నీర్ వర్గాలకు చెందిన ప్రస్తుత లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురే, ఎంపీ వేణుగోపాల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు.. పలువురు కేంద్ర మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఇందులోభాగంగా, రైల్వేశాఖను నితిన్ గడ్కరీకి కట్టబెట్టనున్నారు. రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్‌కు అప్పగించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే, టీడీపీకి చెందిన సీనియర్ నేత అశోకగజపతి రాజు శాఖలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. మొత్తంమ్మీద ఈ విస్తరణలో ఉత్తరాదివారికి పెద్దపీట వేయనున్నారనే ప్రచారం సాగుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Drop Minister Corruption Pm Modi Cabinet Reshuffle Arun Jaitley Rajnath Singh

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి…

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ కుటుంబసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని ...

news

సైబరాబాద్‌లో సైబర్ దాడులు? అదనంగా షీ షటిల్స్‌...

సైబరాబాద్‌లో సైబర్ దాడులు జరుగనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అదనంగా షీ షటిల్స్ ...

news

నీట్ దెబ్బకు విద్యార్థిని సూసైడ్.. రజనీకాంత్‌ విచారం..

దేశంలోని వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత, ...

news

వైఎస్‌ఆర్‌ 8వ వర్ధంతి : కుటుంబ సభ్యుల ఘన నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ...

Widgets Magazine