Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కుమారుడి పేరు..''మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల''.. వర్మ సెటైర్లు

గురువారం, 2 నవంబరు 2017 (08:59 IST)

Widgets Magazine
pawan kalyan with new born baby

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సతీమణి అన్నా ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు పవన్ కల్యాణ్ వైవిధ్యమైన పేరు పెట్టారు. ఈ పేరే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పేరేంటో తెలుసా? ''మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల''. ఈ పేరు వినడానికి.. కొంత వింతగా వున్నా.. ఈ పేరులో ఉన్న అర్థమేమిటి అనే దానిపై సోషల్ మీడియా చర్చ సాగుతోంది. 
 
పవన్ సతీమణి అన్నా లెనిజోవా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. రష్యన్ ఆర్థోడక్స్ మత సంప్రదాయాలను పాటించే ఆమె తన బిడ్డ పేరు కూడా సంప్రదాయబద్ధంగానే ఉండాలని భావించిందట. అందుకే క్రైస్తవంలో "మార్కస్" అనే దేవుడికి సంక్షిప్త రూపంగానే తన బిడ్డ పేరుకు మొదట ‘మార్క్’ అని, చిరంజీవి అసలు పేరు నుంచి "శంకర్"ను, పవన్ పేరు నుంచి "పవనోవిచ్".. వీటిన్నింటినీ కూర్చి "మార్క్ శంకర్ పవనోవిచ్" అనే పేరు పెట్టారని తెలుస్తోంది. పవన్ కుమార్తెకు కూడా పొలెనా అంజనా పవనోవా అని పేరు పెట్టారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్, అన్నా దంపతుల సంతానం.. వారి పేర్లపై పెద్ద చర్చ సాగుతోంది. 
 
మరోవైపు పవన్ కుమారుడి పేరును విన్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై నోటికి పనిచెప్పారు. భాషలు పుట్టిన తర్వాత, నాగరికతలు మొదలైన తర్వాత కూడా ఇంతటి గొప్ప పేరు వినలేదని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ తనయుడి పేరు ముందు తను తలవంచుతున్నానని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ వయస్సులో వారు అలా చేయకూడదన్నారు... గరుడవేగ సెన్సార్ కష్టాలపై..

రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రం సెన్సార్ సమస్య గురించి ఆ చిత్ర దర్శకుడు చెపుతూ... 'చందమామ ...

news

ఏ ముఖం పెట్టుకుని చిరంజీవి ఇంటికి వెళ్లావు రాజశేఖర్... సెటైర్లు...

హీరో రాజశేఖర్ నటించిన చిత్రం గరుడవేగ వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో స్పెషల్ ...

news

కుకీస్ వ్యాపారంలోకి వెంకటేష్ తనయ ఆశ్రిత దగ్గుబాటి...

సినీ నటుడు వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి తొలిసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు ...

news

సన్నీ లియోన్‌ను చూసి సెన్సార్ వారు బాగా ఎంజాయ్ చేశారు...: ప్రవీణ్‌ సత్తార్‌ ఇంటర్వ్యూ

'చందమామ కథలు'లో సామాజిక కోణాల్ని, 'గుంటూరు టాకీస్‌'తో యువతీ యువకుల్లోని ఓ కోణాన్ని ...

Widgets Magazine