శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (08:27 IST)

శ్రీదేవి మృతిపై ఎలాంటి చర్చ అవసరం లేదు: భారత విదేశాంగ శాఖ

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై నెలకొన్న అనుమానాలపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటళ్లో బాత్ ‌టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి ఆమె మరణించినట్లు దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. ఆపై నాలుగు రోజుల తర్వాత ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కానీ శ్రీదేవి మృతి పట్ల అభిమానుల్లో అనుమానాలున్నాయి. 
 
ఉన్నట్టుండి శ్రీదేవి  మరణించడం వెనుక ఏదో జరిగిందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు దుబాయ్ సర్కారు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. అదికూడా తమకు అందినట్లు తెలిపారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని తెలిపారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని రవీష్ కుమార్ తేల్చి చెప్పేశారు. శ్రీదేవి సహజమరణమేనని ఆయన వెల్లడించారు.