Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినిమా విడుదలయ్యాక హీరోయిన్‌ను తొలగించారు.. ఎక్కడ? (వీడియో)

బుధవారం, 15 నవంబరు 2017 (16:32 IST)

Widgets Magazine

సాధారణంగా ఒక చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్‌ను తొలగించడం విన్నాంగానీ, సినిమా విడుదలయ్యాక హీరోయిన్‌ను తీసేయడం ఎక్కడైనా చూశామా? ఏంటి.. సినిమా విడుదలయ్యాక హీరోయిన్‌ను ఎలా తొలగిస్తారనే కదా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడో తమిళ దర్శకుడు. ఆయన చర్యకు యావత్ సినీ ప్రపంచమే అవాక్కైంది.
mehreen
 
ఆ దర్శకుడి పేరు సుశీంద్రన్. ఈయన దర్శకత్వంలో వచ్చిన తాజా తమిళ చిత్రం "నెంజిల్ తుని విరుందాల్". ఇందులో మెహ్రీన్ హీరోయిన్. ఈమెకు కోలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం నిడివి ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. అంతే, సోమవారం ఏకంగా 20 నిమిషాల నిడివివుండే సన్నివేశాలను తొలగించారు. ఆ తర్వాత చిత్రాన్ని చూస్తే మెహ్రీన్‌ ఒక్క సీన్‌లో కూడా కంటికి కనిపించలేదు. 
 
ఈ తొలగించిన సన్నివేశాలన్నీ మెహ్రీన్ నటించినవే కావడం గమనార్హం. కానీ, టైటిల్స్‌లో మాత్రం మెహ్రీన్ పేరు కనిపిస్తోంది. సామాజిక స్పృహ కలిగి, వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుశీంద్రన్ ఇలా చేయడం తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. దీంతో దర్శకుడు హీరోయిన్‌కు బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ మెహ్రీన్‌కు మాత్రం కెరీర్ పరంగా ఈ చర్య ఇబ్బందికరమే. 
 
మరోవైపు.. తెలుగులో 'కృష్ణగాడి వీరప్రేమ గాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె క్యాల్షీట్ల కోసం తెలుగు నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మొత్తంమీద కోలీవుడ్‌లో చుక్కెదురైనప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం మెహ్రీన్ హవా కొనసాగుతోందని చెప్పొచ్చు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఉద్దేశ్యపూర్వకంగా చిరు ఫ్యామిలీని అవమానిస్తున్నారు : బన్నీవాసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై గీతా ఆర్ట్స్‌ సంస్థలో ...

news

రేణూ రెండో వివాహం చేసుకో.. కానీ బ్యాక్‌గ్రౌండ్ ముఖ్యం: పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను ...

news

బైసెక్సువల్ అని తెలిసింది.. కెరీర్ నాశనమైంది : హాలీవుడ్ నటి

కెమెరా ముందు 31 యేళ్ళ హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ బోరున విలపించింది. ఆ మ్యాగజైన్ ...

news

బాహుబలి 2లో తప్పులే తప్పులు.. 450 తప్పులు కనిపెట్టారు (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది.. బంపర్ హిట్ అయిన బాహుబలి 2లో ఒకటి కాదు రెండు ...

Widgets Magazine