Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాట్సాప్‌లో కొత్త ఫీచర్: పొరపాటున పంపిన మెసేజ్‌లను తొలగించుకోవచ్చు...

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (17:32 IST)

Widgets Magazine

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. సోషల్ మాధ్యమాలకు పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ లైవ్‌ను ప్రవేశపెడితే.. తాజాగా వాట్సాప్ గ్రూప్‌లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా తొలగించే సదుపాయాన్ని కల్పించింది. 
 
రోజుకో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న వాట్సప్.. ''మెస్సేజ్ రీకాల్" పేరుతో వ్య‌క్తిగతంగా గానీ, గ్రూప్‌లో గానీ పొర‌పాటున పంపిన మెసేజ్‌ల‌ను తొల‌గించే అవ‌కాశాన్ని ఈ ఫీచ‌ర్ ద్వారా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. కేవ‌లం టెక్ట్స్‌ సందేశాలు మాత్ర‌మే కాకుండా ఫొటోలు, జిఫ్‌ ఫైల్స్‌, వీడియోలు, కాంటాక్ట్‌లను కూడా ఈ ఫీచర్‌ ద్వారా రీకాల్‌ చేసుకోవచ్చు. 
 
కానీ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వారి ఫీడ్‌బ్యాడ్ ఆధారంగా ద‌శ‌ల వారీగా ఈ ఫీచర్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే గ్రూప్‌లో మెసేజ్‌ల‌ను మాత్రం ఎవ‌రూ చ‌ద‌వ‌క‌ముందే రీకాల్ చేసుకోవాలి. ఒక్క‌రు చ‌దివినా ఆ సందేశాన్ని రీకాల్ చేసుకోలేరని వాట్సాప్ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

38శాతం రాయితీ... రూ.29,990లకే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్7పై బంపర్ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మొబైల్‌పై ఫ్లిఫ్ కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు ...

news

షియోమి సేల్స్ అదుర్స్.. నాలుగు మిలియన్ ఫోన్లు అమ్ముడుపోయాయ్

దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు ...

news

ఆధార్ - సిమ్ లింక్‌ ప్రక్రియ మరింత సులభతరం...

ఆధార్ - సిమ్ లింకు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ...

news

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌.. ఇక లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనవచ్చు..

సోషల్ మీడియాలో ఒక్కటైన ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నెట్టింట ...

Widgets Magazine