గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2017 (17:20 IST)

చిరంజీవి 'సైరా' కోసం తెరపైకి కీరవాణి!

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 151వ చిత్రం "సైనా నరసింహా రెడ్డి" ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి తొలుత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చనున్నారనే ప్రచారం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 151వ చిత్రం "సైనా నరసింహా రెడ్డి" ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి తొలుత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చనున్నారనే ప్రచారం జరిగింది. ఆతర్వాత ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి రెహ్మాన్ తప్పుకున్నారు. 
 
ఆ తర్వాత థమన్ పేరు తెరపైకి వచ్చింది. 'సైరా' మోషన్ పోస్టర్‌కు సూపర్ హిట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించింది కూడా థమన్ అందించారు. ఇపుడు థమన్ కూడా వైదొలగడంతో ఆ అవకాశం కీరవాణికి వెళ్లినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సరిపోడని భావించిన రామ్ చరణ్, తమన్‌కు ఇదే విషయాన్ని చెప్పి పక్కకు తప్పించినట్టు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 
 
థమన్ తర్వాత 'సైరా' సంగీత దర్శకుడిగా కీరవాణిని సంప్రదించినట్టు సమాచారం. 'బాహుబలి' వంటి భారీ చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అందరినీ అలరించిన నేపథ్యంలో, చారిత్రక నేపథ్యమున్న 'సైరా'కు ఆయనే సరైన చాన్సని మెగా ఫ్యామిలీ భావిస్తోందట. 
 
ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, గతంలో చిరంజీవి, కీరవాణి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రావడం, తాజా 'బాహుబలి' కీరవాణికి ఈ మెగా చాన్స్‌ను దగ్గర చేసినట్టు తెలుస్తోంది.