శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (16:41 IST)

నభా నటేష్‌కు ఇలియానా లాంటి ఆఫర్ ఇచ్చిన పూరీ

ఇస్మార్ట్‌తో హిట్ కొట్టేసిన అందాల తార నభా నటేష్‌ను పూరి జగన్నాథ్ తన త‌దుప‌రి సినిమాలో కూడా హీరోయిన్‌గా తీసుకున్నాడుట‌. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావ‌డంతో నభా కీల‌క పాత్ర పోషించ‌డంతోనే పూరి రెండ‌వ‌సారి ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. సినిమా హిట్ అయినా… ఫెయిలైనా పూరి పాత హీరోయిన్ల‌ను పెద్ద‌గా రిపీట్ చేయ‌డు. రిపీట్ చేయ‌డం అనేది చాలా రేర్‌గా జ‌రుగుతుంది. 
 
పూరి ప్లాప్ ల్లో ఉన్న‌ప్పుడు పోకిరి తెర‌కెక్కించాడు. అందులో హీరోయిన్ ఇలియానా.  సినిమా హిట్ అవ్వ‌డంతో త‌దుప‌రి గోవా బ్యూటినీ కొన్ని సినిమాల్లో చాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇస్మార్ట్‌తో రీచార్జ్ అయిన నేప‌థ్యంలో నభా న‌టేష్‌కు ఛాన్స్ ఇచ్చాడ‌ని కాంపౌండ్ ప్రచారం సాగుతోంది. ఇంకా కొత్త ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ను న‌భాకు మంచి ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌లే ఓ పెద్ద నిర్మాణ సంస్థ‌ ఆమెను బ‌ల్క్‌గా డేట్లు అడిగిందని తెలిసింది.