Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మ‌హాన‌టి' సినిమాలో చైతు గెట‌ప్ ఎలా ఉంటుందో తెలుసా..?

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:51 IST)

Widgets Magazine

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో రూపొందుతోన్న చిత్రం "మ‌హాన‌టి". ఈ సినిమాకి 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మ‌హాన‌టి' షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.
Naga Chaitanya
 
ఇటీవ‌ల 'మ‌హాన‌టి' టీజ‌ర్ రిలీజ్ చేశారు. కీర్తి సురేష్‌ని చూస్తుంటే... అచ్చు సావిత్రిని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతోంది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కాభిమానులు.
 
 ఇదిలావుంటే... ఈ సినిమాలో అక్కినేని నాగ‌చైత‌న్య అక్కినేని పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే... నాగ‌చైత‌న్య ఏ గెట‌ప్‌లో క‌నిపించ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం... చైత‌న్య 'దేవ‌దాసు' పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. 'దేవ‌దాసు' అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఎంత మంది దేవ‌దాసు పాత్ర‌లో న‌టించినా... దేవ‌దాసు అన‌గానే అంద‌రి మ‌దిలో మెదిలేది మాత్రం అక్కినేనే..! 
 
చైత‌న్య దేవ‌దాసు గెట‌ప్‌లో ఎలా ఉంటాడో..? అస‌లు చైతు దేవ‌దాసుగా ఎలా న‌టించాడో తెలియాలంటే మే 9వ తేదీ వరకు వేచివుండాల్సిందే. ఆ రోజున ఈ చిత్రం రిలీజకానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేచురల్ స్టార్ లెక్క త‌ప్పిందా..? కార‌ణం ఏమిటి..?

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ మూవీ "కృష్ణార్జున యుద్ధం". మేర్ల‌పాక గాంధీ ...

news

"వచ్చాడయ్యో సామి'' అంటున్న మహేష్ బాబు (టీజర్ సాంగ్)

ప్రిన్స్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". ఈ ...

news

పవన్‌ని 'అన్నా' అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా : సినీ నటి శ్రీరెడ్డి

జనసేన పార్టీ అధినేత, అగ్ర హీరో పవన్ కల్యాణ్‌పై మహిళా నటి శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ...

news

డాక్టర్ రాంగ్ ట్రీట్మెంట్ వల్లే హీరో శ్రీహరి చనిపోయాడు : డిస్కోశాంతి

హీరో శ్రీహరి మరణంపై ఆయన భార్య, సినీ నటి డిస్కోశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ...

Widgets Magazine