ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (19:50 IST)

సమంతలో ఇంత మార్పు ఊహించలేదు... నాగార్జున

నాగ చైతన్యతో కలిసి సమంత ఇంటికి వచ్చింది. నాగ్ సర్... మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పింది. తన ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడో చైతన్య నాకు చెప్పాడు. సమంత లాంటి అణకువ కలిగిన అమ్మాయి మా ఇంటికి కోడలిగా రావడం అదృష్టమన

నాగ చైతన్యతో కలిసి సమంత ఇంటికి వచ్చింది. నాగ్ సర్... మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పింది. తన ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడో చైతన్య నాకు చెప్పాడు. సమంత లాంటి అణకువ కలిగిన అమ్మాయి మా ఇంటికి కోడలిగా రావడం అదృష్టమని నేను చెప్పా. పెళ్ళి కాకముందు సమంత... నాగ్ సార్ అంటూ పిలిచేది. షూటింగ్‌లోనైనా, ఇంటిలోనైనా అలాగే పిలుస్తూ ఉండేది.
 
పెళ్ళైన రెండురోజుల తరువాత కూడా అలాగే పిలిచింది. అయితే ఆ తరువాత అంకుల్ అంటూ పిలుస్తోంది. ఆ పిలుపు నాకు బాగా నచ్చింది. మనం సినిమాలో మా అమ్మ క్యారెక్టర్‌లో నటించిన సమంతలో ఇప్పటికీ నేను మా అమ్మను చూసుకుంటున్నా. చిలిపితనం, మంచితనం, అందరితోను కలిసిపోయే గుణం సమంత నైజం. అది నాకు చాలా బాగా నచ్చింది. మా కుటుంబంలో సమంత చాలా బాగా కలిసిపోయింది అంటూ నాగార్జున సమంతలో వచ్చిన మార్పు గురించి చెప్పారు.