వర్మ సినిమాలో నాగార్జున సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్!

మంగళవారం, 2 జనవరి 2018 (15:48 IST)

nagarjuna

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌ రెండున్నర దశాబ్దాల తర్వాత రిపీట్ కానుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "శివ" చిత్రం సంచలన విజయం నమోదుచేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. 
 
పోలీస్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గత యేడాది న‌వంబర్ 20వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇటీవ‌లే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌కి కూడా సిద్ధ‌మైంది. ఇందులో క‌థానాయిక‌గా అనుష్క‌, ట‌బు అని ప‌లు పేర్లు వినిపించిన‌, చివ‌రికి మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని దర్శకుడు వర్మ ఎంచుకున్నారు. 
 
ఇక ఈ సినిమాపై అంద‌రిలోను ఎంతో ఉత్కంఠ నెల‌కొన‌గా, మూవీకి ఎలాంటి టైటిల్ పెడ‌తాడు, నాగ్ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానులు ప‌లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే చిత్రానికి "గ‌న్" అనే టైటిల్ ఫిక్స్ చేస్తాడ‌ని అంద‌రు భావిస్తున్నారు. ఇక నాగ్ లుక్ విష‌యానికి వ‌స్తే తాజాగా కింగ్ నాగ్ సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఇది వ‌ర్మ సినిమాకి సంబంధించిన లుక్ అని కొంద‌రు అంటుండ‌గా, మ‌రి కొంద‌రు మార్ఫింగ్ అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. దీనిపై మరింత చదవండి :  
Nagarjuna Movie Gun Six Pack Ram Gopal Varma

Loading comments ...

తెలుగు సినిమా

news

గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12వరకు జ్యుడిషియల్ రిమాండ్

ఆధ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గాయకుడు గజల్‌ ...

news

హైపర్ ఆదికి అలా జబర్దస్త్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది

''జబర్దస్త్'' కార్యక్రమంలో పాల్గొనే నటులకు సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న సంగతి ...

news

చిరంజీవితో అలా తప్ప ఇంకెలాగైనా నటిస్తానంటున్న కీర్తి సురేష్

కీర్తి సురేష్. అటు తెలుగు, ఇటు తమిళ భాష సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన హీరోయిన్. ...

news

'జోకర్' పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న 'కత్తి'

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి ...