Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈసారి ఖచ్చితంగా వస్తా బాబాయ్ ... 'ఎమ్మెల్యే' కళ్యాణ్ రామ్

బుధవారం, 21 మార్చి 2018 (15:50 IST)

Widgets Magazine

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే 23వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
mla movie still
 
ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ వంశీ పైడిపైల్లి సహా పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే ఈ కార్యక్రమంలో హీరో కల్యాణ్ రామ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
 
'నేను ఇండస్ట్రీలో బాబాయ్.. బాబాయ్ అని పిలిచే ఏకైక వ్యక్తి నరేష్. నేను అలా మా బాబాయ్‌ని తప్ప వేరే ఎవరనీ పిలవను. బాబాయ్ తర్వాత నరేష్‌నే అలా పిలుస్తాను. ఫిలింనగర్‌లో నా ఆఫీస్ పక్కనే తన ఆఫీస్ ఉండేది. నాకు పెళ్లి అయ్యే వరకు నరేష్, నేను రోజూ కలిసేవాళ్లం. పెళ్లి తర్వాత నేనే అతడిని కలవడం మానేశాను.. పాపం ఇందులో అతడి తప్పేంలేదు.
 
అప్పటి నుంచి ఇప్పటి వరకు తన(నరేష్) ఆడియో ఫంక్షన్ ఏది జరిగినా మొదటి కాల్ నాకే వస్తుంది. కానీ నేనెప్పుడూ వెళ్లలేకపోయాను. సారీ బాబాయ్.. నువ్వు ఎన్ని సార్లు పిలిచినా రాలేకపోయా. కానీ.. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నా ఫంక్షన్‌కు వచ్చి నన్ను విష్ చేశావు. చాలా థ్యాంక్స్. ఈ సారి నీ సినిమా ఫంక్షన్‌కు ఖచ్చితంగా వస్తా.. నువ్వు వచ్చావని మాత్రం కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతకుముందు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, సినిమాల్లో ఎమ్మెల్యేగా ఉండటం కాదనీ, రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఉండాలని ఆకాంక్షించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీదంటూ గుర్తు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తెలుగుదేశం మీ పార్టీ.. రాజకీయంగా ఎమ్మెల్యే కావాలి... ఎవరన్నారు?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం ...

news

సాహస జంప్‌ చేస్తూ గాయపడిన బాలీవుడ్ నటి నటాషా సూరి (వీడియో)

బాలీవుడ్ నటీమణి, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటాషా సూరి ప్రమాదంలో చిక్కుకుంది. ఇండోనేషియాలో ...

news

ప్రేమించిన ఆ మెగా హీరో పేరు చెప్పండి.. పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్

అతి తక్కువ కాలంలోనే వెండితెరపై తన అందచందాలతో యువత మనసు దోచుకున్న హీరోయిన్లలో రాశిఖన్నా ...

news

'భజరంగీ భాయ్‌జాన్' రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమైన 'బాహుబలి 2'

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బాహుబలి : ది ...

Widgets Magazine