ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత శ్రీదేవి కోసం అజిత్.. #NerkondaPaarvai (ట్రైలర్)

Last Updated: బుధవారం, 12 జూన్ 2019 (19:02 IST)
ఇదేంటి అనుకుంటున్నారా.. అవునండి.. అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా శ్రీదేవి రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభాన్నిచ్చింది. ఆ సినిమాలో తమిళ హీరో అజిత్ అతిథి పాత్రలో కనిపించారు. ఆమె మరణానికి తర్వాత శ్రీదేవి భర్త నిర్మించే సినిమాలో అజిత్ నటించారు. ఆ సినిమా పేరు నేర్కొండ పార్వై. 
 
ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రారంభంలోనే శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ లుక్‌తో ఆ ఫోటో కనిపిస్తుంది. వీడని జ్ఞాపకాలతో అంటూ అందుకు తమిళ క్యాప్షన్ వుంది. ఆపై అజిత్ లాయర్ లుక్‌లో ఈ ట్రైలర్‌లో కనిపించారు. మొత్తం సినిమా మహిళల అంశాలను టచ్ చేస్తూ సాగుతోంది. ఈ చిత్రంలో అజిత్ లుక్ సాధారణంగా వుంది. గడ్డంపై లాయర్‌గా అజిత్ పాత్రకు చక్కని న్యాయం చేస్తాడని అర్థమైపోతుంది. 
 
ట్రైలర్‌లో అజిత్ మాస్ మసాలా కనిపించలేదు. సర్వసాధారణమైనా రోల్‌లో అజిత్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా చేసేందుకు అజిత్ ఒప్పుకున్నారంటే అది శ్రీదేవి కోసమేనని ఫ్యాన్స్ మధ్య అప్పుడే టాక్ మొదలైంది. శ్రీదేవి భర్త నిర్మించే బ్యానర్‌లో నటించి ఆమెను అజిత్ ఓసారి స్మరించుకున్నారని తెలుస్తోంది. 
 
ఇకపోతే.. అజిత్ కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, అర్జున్ చిదంబరం, అశ్విన్ రావు తదితరులు నటించిన నేర్కొండ పార్వై సినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు. జీ సంస్థతో శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అజిత్ ఈ సినిమాలో నటించారు.
 
అలాగే ఆర్ యూ వర్జిన్ అంటూ ఈ సినిమా ట్రైలర్‌లో మీరా పేరిట వున్న శ్రద్ధా శ్రీనాథ్‌ను ప్రశ్నించడం ఈ ట్రైలర్‌కు హైలైట్. పింక్ సినిమా రీమేక్‌గా నటిస్తున్న తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇంకా ఈ సినిమా ఆగస్టు పదో తేదీన రిలీజ్ కానుంది. దీనిపై మరింత చదవండి :