1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 17 జులై 2018 (20:10 IST)

నిహారిక ప్రి- హ్యాపి వెడ్డింగ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.... అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టుతో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మై ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా త‌న ప్

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.... అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టుతో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మై ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. ఈ నెల 21న ప్రి-వెడ్డింగ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
శక్తికాంత్ మ్యూజిక్, ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ రీ-రికార్డింగ్ అద్భుతంగా అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ చిత్రం కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... ``పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌ని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నెల 21న ప్రి-వెడ్డింగ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని అన్నారు.
 
సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్, రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్, కెమెరా - బాల్ రెడ్డి, మ్యూజిక్ - శ‌క్తికాంత్ కార్తిక్‌ నిర్మాత‌ - పాకెట్ సినిమా, ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మ‌ణ్ కార్య‌