అభిమాన హీరోను తిట్టిన శ్రీరెడ్డి.. ఆగ్రహించిన నితిన్... జస్ట్ వెయిట్ అంటూ...

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (15:39 IST)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నితిన్ ఒకరు. ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే, ఈ యువ హీరో కూడా మరో టాలీవుడ్ సీనియర్ హీరో వీరాభిమాని. ఆ హీరో ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత. తన అభిమాన హీరోను ఎవరైనా పల్లెత్తు మాట అంటే మాత్రం ఊరుకోడు.
nithiin
 
తాజాగా నటి శ్రీరెడ్డి తన అభిమాన హీరోతో పాటు.. ఆయన తల్లిపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నితిన్ కూడా స్పందించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని, దానికోసం వేచి చూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. 
 
"For every action there is an equal and opposite reaction... just wait for it.... its coming!!!" అని ట్వీట్ పెట్టాడు. గత రెండు రోజులుగా టాలీవుడ్ మహిళా నటులు, ముఖ్యంగా శ్రీరెడ్డికి, పవన్ ఫ్యాన్స్‌కూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, నితిన్ ఈ ట్వీట్ పెట్టడం గమనార్హం. దీనిపై మరింత చదవండి :  
శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ట్వీట్ క్యాస్టింగ్ కౌచ్ Nithiin Tweet Sri Reddy Casting Couch నితిన్ Pawan Kalyan

Loading comments ...

తెలుగు సినిమా

news

'నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు' : వరుణ్ తేజ్

టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం ...

news

ఎఫ్ 2 సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

'ప‌టాస్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. ...

news

చ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ టైటిల్ ఇదే..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ "రంగ‌స్థ‌లం" సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. రూ.100 ...

news

'భ‌ర‌త్ అనే నేను' క‌థ కొర‌టాల రాసింది కాదా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన ...