బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (14:58 IST)

హ్యాట్రిక్ సంబరాల్లో కుర్ర హీరోయిన్...

టాలీవుడ్‌కు పరిచయమైన కుర్ర హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. ఈమె నటించిన మూడు చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ భామ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నివేదా థామస్ తొలి చిత్రం 'జెంటిల్‌మేన్'. నాని హీర

టాలీవుడ్‌కు పరిచయమైన కుర్ర హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. ఈమె నటించిన మూడు చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ భామ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నివేదా థామస్ తొలి చిత్రం 'జెంటిల్‌మేన్'. నాని హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఆ తర్వాత 'నిన్ను కోరి' చిత్రం. తాజాగ "జై లవ కుశ". ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో నివేదా భావోద్వేగపూరిత ట్వీట్ చేసింది. తాను నటించిన మొదటి మూడు సినిమాలను బాగా ఆదరించారని ఓ లేఖ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 
 
టాలీవుడ్ తనను సొంత మనిషిలా చూడటం కన్నా పెద్ద ప్రశంస తనకు ఏమీ ఉండదని పేర్కొంది. తెలుగు సినీ పరిశ్రమ తనను తమ అమ్మాయి అని పిలుస్తోందని, దీనిని ఆశీర్వాదంగా భావిస్తున్నానని తెలిపింది. తన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పినా అది తక్కువేన‌ని నివేదా థామస్ చెప్పింది. 
 
త‌న కొత్త సినిమా ‘జై లవకుశ’ను ఆద‌రిస్తున్నందుకు థ్యాంక్స్ అని పేర్కొంది. తాను మరో మంచి సినిమాలో, మరో పాత్రతో ప్రేక్ష‌కుల‌ని క‌లుస్తాన‌ని తెలిపింది. మలయాళీ భామ అయిన‌ నివేదా థామస్.. నాని స‌ర‌స‌న‌ త‌న‌ మొద‌టి రెండు సినిమాల్లో న‌టించింది. ఆ వెంట‌నే ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ కొట్టేసింది. త‌న సినిమాల‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ ప‌ట్ల ఇలా హ‌ర్షం వ్య‌క్తంచేసింది.