ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభం... అచ్చం ఎన్టీఆర్‌లానే బాలయ్య(Video)

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాల‌య్య‌ ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉన్న ఎన్టీఆర్ బ‌

NTR BioPic Look
srinivas| Last Modified శుక్రవారం, 6 జులై 2018 (16:56 IST)
మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాల‌య్య‌ ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ గెట‌ప్‌లో ఉన్న బాల‌య్య ఫోటోను రిలీజ్ చేసారు. మనదేశం చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌లో బాలయ్య బాగున్నారు. ముఖ్యంగా ఖాకీ దుస్తులు టోపీతో ఆయన ఎన్టీఆర్‌ని గుర్తుకు తెస్తున్నారు.
 
ఎన్టీఆర్‌గా బాలయ్యను చూసిన నందమూరి అభిమానులు ఆ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. షూటింగ్ ప్రారంభించారు కానీ... ఇందులో ఇంకా కొన్ని పాత్ర‌ల కోసం న‌టీన‌టుల‌ను ఎంపిక చేయాల్సి వుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీడియో చూడండి...దీనిపై మరింత చదవండి :