Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"పద్మావతి" వెనకడుగు.. విడుదల వాయిదా

ఆదివారం, 19 నవంబరు 2017 (16:43 IST)

Widgets Magazine
padmavati movie still

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా "పద్మావతి" మూవీ టీమ్ వెనుకడుగు వేసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ రాజ్‌పుత్ కర్ణిసేన తొలి నుంచి ఆందోళన చేస్తోంది. 
 
ఈ ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. ఈ చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్లకు నిప్పు అంటిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాకుండా, డిసెంబర్ 1న సినిమా విడుదల కానుండటంతో ఆ రోజు భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. దీంతో సినిమాను ఆ రోజు విడుదల చేయకూడదని ఆ మూవీ టీమ్ నిర్ణయించింది. తమంతట తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సినిమా యూనిట్ వెల్లడించింది. 
 
కొత్త రిలీజ్ డేట్‌ను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. సినిమాకు ఇంకా సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. దీనికోసం పద్మావతి టీమ్ దరఖాస్తు చేసుకున్నా.. అది అసంపూర్తిగా ఉందంటూ సీబీఎఫ్‌సీ తిరిగి పంపించేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వాయిదా వేయక తప్పలేదు. 
 
మరోవైపు, ‘పద్మావతి’ రిలీజ్ కాకుండా చూడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. సినిమాలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేంతవరకు విడుదలకాకుండా అడ్డుకోవాలని అందులో కోరారు.
 
‘పద్మావతి’ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేముందు సెన్సార్ బోర్డు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాత పెట్టుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు సినిమాను వెనక్కి పంపిన మరుసటి రోజే వసుంధర ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
చరిత్రకారులు, సినీ నిపుణులు, రాజ్‌పుట్ కమ్యూనిటీ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు సినిమా చూసిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'నంది' జ్యూరీ సభ్యుల ఎంపికలోనే తప్పు జరిగింది : అశ్వినీదత్

నంది అవార్డులను ప్రకటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొంత తప్పు చేసిందనీ ప్రముఖ ...

news

అడిగినంత ఇస్తేనే మీకు కోఆపరేట్ చేస్తా : తేల్చి చెప్పిన హీరోయిన్

తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే మీరు కోరినట్టుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ...

news

'మనం'ను పరిగణనలోకి తీసుకోకపోవడమే పక్షపాతం : ఎన్వీ ప్రసాద్

మంచి హిట్ సాంధించిన మనం చిత్రాన్ని నంది అవార్డుల జ్యూరీ కనీసం పరిగణనలోకి కూడా ...

news

పవన్‌తో చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను : రకుల్

హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మిస్ చేసుకోబనని, ఖచ్చితంగా ఆయనతో కలిసి ...

Widgets Magazine