Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలీవుడ్‌లో "పద్మావతి" రచ్చ : రిలీజ్ వద్దు... విడుదల చేయాల్సిందే...

మంగళవారం, 14 నవంబరు 2017 (14:25 IST)

Widgets Magazine
padmavati movie still

బాలీవుడ్‌లో 'పద్మావతి' మూవీ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ చిత్రం యావత్తూ మద్దతు ప్రకటించింది. కానీ, శివసేన మాత్రం ఈ చిత్ర విడుదలను నిలిపివేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో 'పద్మావతి' రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. 
 
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావతి'. ఇందులో రణ్‌వీర్, దీపికాలు హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం అసభ్యకర, హిందూమతాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని అందువల్ల చిత్రాన్ని రిలీజ్ చేయరాదంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'పద్మావతి' చిత్రం విడుదలను నిషేధించాలని మహారాష్ట్ర ఎమ్మెల్యే సుజిత్‌సింగ్ ఠాకూర్ సీఎం ఫడ్నవిస్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సీఎం ఫడ్నవిస్‌కు ఓ లేఖ రాశారు. 'పద్మావతి' సినిమా విడుదలపై ఆందోళనల నేపథ్యంలో సామాజిక వర్గాల నేతలకు స్పెషల్ షో వేయాలని సుజిత్‌సింగ్ సీఎం ఫడ్నవిస్‌ను కోరారు.
 
మరోవైపు, పద్మావతి మూవీకి బాలీవుడ్ ఇండస్ట్రీ, టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ మద్దతుగా నిలిచింది. ఈ మేరకు అసోసియేషన్ ముంబైలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసింది. బన్సాలీ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని.. విడుదలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా, సంజయ్ లీలా బన్సాలీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా రిలీజ్ చేసేందుకు 'పద్మావతి' మూవీని ఆందోళనకారుల కోసం స్పెషల్ షో వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ షోను తిలకించిన తర్వాతైనా ఆందోళనకారులు సద్దుమణిగిపోతారో లేదో వేచిచూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#SunnyLeone : మగరాయుడి గెటప్‌లో హాట్‌ బాంబ్ (వీడియో)

పోర్న్‌స్టార్, బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ మగరాయుడి అవతారమెత్తారు. ఈ గెటప్‌ను చూసిన ...

news

అనుష్కకు కరణ్ జోహార్ ఆఫర్... ప్రభాస్ వద్దు స్వీటీ అనేశాడా?

అనుష్క, ప్రభాస్ అనగానే హిట్ పెయిర్ అనే పేరుంది. అంతేకాదు వారి మధ్య రిలేషన్ చాలా చక్కగా ...

news

పవన్ దేవుడా.. ఫ్యాన్స్ ఓవరాక్షన్‌పై స్పందిస్తే అప్పుడు నమ్ముతా: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి ...

news

#Paruchuri GK‏ : నవంబర్ 13 జీవితంలో రాకూడదు...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కథా రచయితల్లో పరుచూరి బ్రదర్స్ ఒకరు. వీరిలో పరుచూరి ...

Widgets Magazine