Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను చాలా మొండోడిని... పైగా బలవంతుడిని : పవన్ 'కత్తి'లాంటి కౌంటర్

బుధవారం, 24 జనవరి 2018 (06:32 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తిలాంటి వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఇటీవల తన జపం చేస్తూ విమర్శలు గుప్పించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నాయి. 
 
పవన్ కల్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో 'చలోరే.. చలోరే చల్' యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కొండగట్టు ఆంజనేయస్వామికి పూజలు చేసిన రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్, ఈ యాత్రలో జనసేన పార్టీకి సంబంధించిన వ్యవస్థాగత ఏర్పాట్ల గురించి వివరిస్తూ వెళుతున్నారు. యాత్రలో కత్తి ప్రస్తావన కూడా వచ్చిందనే టాక్ నడుస్తుంది. దీనిపై పవన్ మాట్లాడుతూ, 
 
"భారతదేశంలో చాలా సమస్యలున్నాయి. కానీ అవన్నీ వదిలేసి కొందరు కావాలనే నన్ను టార్గెట్ చేశారు. అలాంటి వారందరినీ ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను. నేను కూడా చాలా మొండివాడినే. అందులో నేను బలవంతుడిని. ఇలాంటివి చూసి పిరికివాడిలా పారిపోయే వ్యక్తిని అయితే కాను. బలవంతుడు మాత్రమే భరించగలడు. ఎవరెన్ని మాటలన్నా భరిస్తా. ఆ శక్తి నాకుంది. అయితే కార్యకర్తలుగా మీరు మాత్రం ఎక్కువగా రియాక్ట్ అవకండి. నాకన్నీ తెలుసు, నేను చూసుకుంటాను" అంటూ పవన్ తన అభిమానులకు సూచనలు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శివానీ అరంగేట్రం ఖరారైంది.. అడవిశేష్‌తో రొమాన్స్..

గరుడ వేగ నటుడు, యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల కుమార్తె శివాని ...

news

పవర్ స్టార్‌కు టాలీవుడ్ హీరో సపోర్ట్...

రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ...

news

పద్మావత్‌కు బ్రేక్ వేయలేం : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావత్‌'కు బ్రేకులు వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి ...

news

ఆందోళనకారులను చిత‌క్కొడుతున్న‌ రాంగోపాల్ వర్మ (వీడియో)

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఆందోళనకారులను చితక్కొట్టారు. తన స్టంట్స్‌తో అందర్నీ ...

Widgets Magazine