Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేసీఆర్‌తో మాట్లాడితే తప్పేంటి? పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

మంగళవారం, 23 జనవరి 2018 (13:20 IST)

Widgets Magazine
pawan kalyan - kcr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయితే తప్పేముందని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే ఇంత రచ్చ చేయల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ప్రజలు ఓటుతో తీర్పునిస్తే ఆయన గెలిచారని చెప్పారు. 
 
ఏ పార్టీకైనా సరే ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయా ప్రభుత్వాలను గౌరవించాలని పవన్ అన్నారు. కరీంనగర్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దశాబ్దాల తరువాత తెలంగాణ వచ్చిందని, తానెప్పుడూ సునిశితంగా ఆలోచిస్తానని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తానని తెలిపారు. 
 
ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పనిచేయట్లేదని.. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని.. వాటిని ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. ఆ దిశగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
 
విమర్శలకు తావిచ్చి రాజకీయాలను అస్థిరపరిచే ఉద్దేశం తనకు లేదని పవన్ స్పష్టం చేశారు. విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలకు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Friend Kcr Politics Agnathavaasi Pawan Kalyan Karim Nagar Chalo Re Chalo Re

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రిపుల్ తలాక్ ముస్లిం పురుషులను శిక్షించేందుకే: ఓవైసీ

ఎన్నికల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ. 15లక్షలు జమ ...

news

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... ...

news

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధం: దోషికి 60ఏళ్ల జైలు శిక్ష

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. పెన్సల్వేనియా హైస్కూల్లో ...

news

కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ను వేధించిన ఆ ముగ్గురు..

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో ఓ అధ్యాపకురాలికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మెరిట్‌పై ...

Widgets Magazine