'బాహుబలి 1', 'ఖైదీ నంబర్ 150' రికార్డును బ్రేక్ చేసిన 'అజ్ఞాతవాసి'

బుధవారం, 10 జనవరి 2018 (15:28 IST)

pspk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం బుధవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం 'బాహుబలి 1', 'ఖైదీ నంబర్ 150' చిత్రాలను బ్రేక్ చేసింది. ముఖ్యంగా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే 'అజ్ఞాత‌వాసి' ఓవ‌ర్సీస్‌లో త‌న స‌త్తా చాటుతున్నాడు. 
 
ప్రీమియ‌ర్ షోల ద్వారానే భారీ క‌లెక్ష‌న్లు సాధిస్తున్నాడు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబ‌ర్ 150' రికార్డుల‌ను బ‌ద్ద‌లుగొట్టిన 'అజ్ఞాత‌వాసి' తాజాగా 'బాహుబ‌లి-1' రికార్డునూ దాటేశాడు. ప్ర‌మీయ‌ర్ షోల ద్వారా 'బాహుబ‌లి-1' 1.36 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఆర్జించింది.
 
తాజాగా 'అజ్ఞాత‌వాసి' ప్రీమియ‌ర్ షోల ద్వారా 1.41 మిలియ‌న్ డాల‌ర్లు సాధించి.. 'బాహుబ‌లి-2' త‌ర్వాత రెండో స్థానంలో నిలిచాడు. దీంతో 'బాహుబ‌లి-1' రికార్డు బ్రేక్ అయింది. కాగా, ఎల్ఏ సంస్థ 'అజ్ఞాత‌వాసి' ఓవ‌ర్సీస్ హ‌క్కుల కోసం 19.5 కోట్ల రూపాయ‌లు చెల్లించిన‌ట్టు స‌మాచారం. మరోవైపు అమెరికాలో 600 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతున్నప్పటికీ.. టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడటం గమనార్హం. 
 
ఇదిలావుంటే ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్‌ షోలు పవన్ అభిమానులకు చుక్కలు చూపించాయి. జేబులకు టికెట్‌ ధర చిల్లుపెట్టింది. దాదాపు అన్ని థియేటర్లలోనూ ప్రీమియర్‌ షోలు వేశారు. కానీ ఒక్కొక్క ప్రీమియర్‌ షోకు టికెట్‌ ధర 700 రూపాయలుగా నిర్ధారించారు. టికెట్‌ ధర ఇంత రేటు ఉంటుందని అభిమానులు ఎవరూ ఊహించలేదు. ప్రీమియర్‌ షో కాబట్టి సాధారణ షోలకంటే కాస్తంత ఎక్కువగానే ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. కానీ, పెంచిన ధరలను చూసి ఒక్కసారి అవాక్కయ్యారు. దీనిపై మరింత చదవండి :  
Agnyaathavaasi Pawankalyan Breaks Baahubali 1 Records Khaidi No.150

Loading comments ...

తెలుగు సినిమా

news

'పద్మావతి'కి ఓకేగానీ... 300 కట్స్ అవాస్తమట...

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌ ప్రధాన పాత్రల్లో సంజయ్ ...

news

పవన్ మానియా.. ఒక్క షో పడకుండానే రికార్డులు... ఎక్కడ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈయ‌న పేరు ఓ సంచ‌ల‌నం. చేసిందే 25 సినిమాలే అయిన ప్ర‌జ‌ల ...

news

'అజ్ఞాతవాసి' పబ్లిక్ టాక్ సరేగానీ.. ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ...

news

చలపతిరావు కామెంట్స్‌-సూపరన్న రవి.. నాంపల్లి కోర్టుకు హాజరు

'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అభ్యంతరకర ...