శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మే 2020 (17:50 IST)

పాజిటివిటీ ప్ర‌శాంతతోనే భ‌విష్య‌త్‌!- ఉపాస‌న కొణిదెల‌

కర్టెసీ- ట్విట్టర్
మెగా కోడలు ఉపాసన కొణిదెల లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. అపోలో లైఫ్-అపోలో ఫౌండేష‌న్ అధినేతగా అభిమానుల‌కు నిరంత‌రం యూట్యూబ్ వేదికగా అవేర్నెస్ పెంచుతున్నారు. ఈ వేదిక‌పై ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
 
ఇక సోష‌ల్ మీడియాలో భ‌ర్త రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన వ్య‌వ‌హారాల‌తో పాటు సినిమాల సంగ‌తుల్ని ముచ్చ‌టిస్తూ మెగా ఫ్యాన్స్‌కి ట‌చ్‌లో ఉన్నారు. సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో అభిమానులు త‌న‌ని అనుస‌రిస్తుండ‌టం ఆస‌క్తికరం.
 
హైద‌రాబాద్‌లో ఉన్న బెస్ట్ మ‌హిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఒక‌రిగా ఉపాస‌న గౌర‌వం అందుకుంటున్నారు. ఇంత‌కుముందు ప‌లు గ్లోబ‌ల్ స‌మ్మిట్ కార్య‌క్ర‌మాలు.. పారిశ్రామిక వేత్త‌ల స‌మావేశాల్లో అద్భుత‌మైన స్పీచ్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. 
 
ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనా ఉపాస‌న గౌర‌వం అందుకున్నారు. విలువ‌ల‌తో కూడుకున్న ఆరోగ్య‌వంత‌మైన స‌మాజ స్థాప‌న‌కై త‌న ప్ర‌య‌త్నం యువ‌త‌రంలో ప్ర‌తిసారీ స్ఫూర్తిని నింపుతున్నారు. బిల్ గేట్స్ వంటి ప్ర‌ముఖుల‌తో క‌లిసి ఇండియ‌న్ ఫిలాంథ్ర‌పి ఇనిషియేటివ్ (ఐపీఐ) ద్వారా మ‌రిన్ని అవేర్నెస్ కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.
 
తాజాగా ఉపాస‌న ఓ థ్రోబ్యాక్ ఫోటోని అభిమానుల‌కు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ``ఈ పోస్ట్ మీలో స్ఫూర్తి నింపుతుంది. గుడ్ టైమ్ కోసం వేచి చూడాలి. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శాంత చిత్తాన్ని క‌లిగి ఉండాలి. భవిష్య‌త్ కోసం పాజిటివ్‌గా వేచి చూడాలి`` అంటూ చ‌క్క‌ని సందేశాన్ని ఇచ్చారు.
 
క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో ఇలాంటి పాజిటివ్ సూచ‌న‌లు చేయ‌డం సామాన్యుల్లో ధైర్యాన్ని నింప‌డం ఆహ్వానించ‌ద‌గిన‌దే. హ్యాట్సాఫ్ టు మెగా కోడ‌లు ఉపాస‌న‌.