ఇకపై టీవీ వ్యాఖ్యాతగా కనిపించనున్న పవన్ కళ్యాణ్? ఏ టీవీకి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న పవన్... రాజకీయాలవైపు అడుగులు వేశారు. సమాజంలో బలమైన మార్పు తెచ్చేందుకు ఆయన తన శక్తిమేరకు కృషి చేస్తున్నార

pawan kalyan
pnr| Last Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (14:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న పవన్... రాజకీయాలవైపు అడుగులు వేశారు. సమాజంలో బలమైన మార్పు తెచ్చేందుకు ఆయన తన శక్తిమేరకు కృషి చేస్తున్నారు. అదేసమయంలో పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు.
 
ఇందులోభాగంగా ఆనేక సమస్యలపై ఆయన ఎప్పటికపుడు స్పందిస్తున్నారు. కీలకమైన విషయాలపై ఆయన తనమనసులోని మాటను కుండబద్ధలుకొట్టినట్టు చెబుతున్నారు. అలా వెల్లడిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 
 
అదికూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్లో కావడం విశేషం. ఈ న్యూస్ ఛానెల్ పేరు 'ఇండియా ఎహెడ్'. ఈ ఛానెల్ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ షోలో పవన్ అనేక సామాజిక అంశాలు, సమస్యలపై మాట్లాడతారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే పవన్ లేదా జనసేన శ్రేణుల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దీనిపై మరింత చదవండి :