మంచు విష్ణు ఏమైనా అమెరికా ప్రెసిడెంటా? ఎవరన్నారో తెలుసా!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు అన్న విషయం తెలిసిందే. ప్రకాష్‌రాజ్‌కు పోటీగా నిలబడి గెలిచి `మా` అసోసియేషన్‌కు చాలా పనులు చేయాలని ఆలోచించారు. అందుకు ప్రణాళికలు కూడా వేశారు. అయితే అంతకుముందు వున్న కమిటీలోనివారుకానీ ఆఫీస్ స్టాఫ్‌ను కానీ మొత్తాన్ని మార్చేశారు మంచు విష్ణు. ఈ విషయం సినీ పెద్దలకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే అక్కడి స్టాఫ్‌ను మార్చడం తెలిసిందే. అయితే చాలా కాలంగా సెలైంట్‌గా వున్న మా కార్యక్రమాలు ఇప్పుడు పుంజుకున్నాయి.
పేదకళాకారులకు, ప్రతి సభ్యుడికి ఉపయోగపడే చర్యలు చేపట్టాలని తాజాగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఇంత అంకితభావంతో పనిచేసే టీమ్‌తో పని చేస్తున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. `మా`కి మేము తీసుకొచ్చిన సంస్కరణలు అసాధారణమైనవి మరియు వేగవంతమైన మరియు మెరుగైన వృద్ధికి మార్గం సుగమం చేస్తాయి. అంటూ మీటింగ్ గురించి సూచాయిగా మంచు విష్ణు ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజర్లు పలురకాలుగా స్పందించడం విశేషం.
మంచి ఎదుగుదల కోసం నువ్వు సినిమా తియ్యకు మంచు అన్న అంటూ ఒకరంటే నువ్వు ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ ఏంట్రా బొక్కలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ ....పక్కకి వెళ్లి ఆడుకో రా జొన్నా అని మరొకరు తీవ్రంగా స్పందించారు. ఒరేయ్ ఏంట్రా నీ లొల్లి ఒక ఫోటో కోసం అంత మందిని పిలాచావా! అంటూ మరొకరు కామెంట్ చేశారు. కొన్ని సర్లు రాజ్యాన్ని(tfi) కాపాడుకోడానికి రాజే సేనాధిపతి గా వస్తాడంటూ మరొకరు స్పందించారు. ఏది ఏమైనా తాము చేయాల్సిన పనులు చేస్తామని మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అవి ఏమిటనేవి త్వరలో తెలియనున్నాయి.