Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

5 నిమిషాలకు రూ.5 కోట్లు తీసుకున్న వీడియో ఇదే

శనివారం, 23 డిశెంబరు 2017 (13:00 IST)

Widgets Magazine
priyanka chopra

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఇపుడు బాలీవుడ్ కంటే హాలీవుడ్‌ చిత్రాలకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. దీంతో ఈ భామ కోసం బాలీవుడ్ నిర్మాతలు పడిగాపులుకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆమె కేవలం 5 నిమిషాల కార్యక్రమానికి రూ.5 కోట్లు వసూలు చేసిందన్న వార్త బాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారింది. ఈ ప్రదర్శన రిహార్సల్ వీడియోను ప్రియాంకా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఇటీవ‌ల ముంబైలో జీ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రియాంకా చోప్రా లైవ్‌ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. అదీ కూడా కేవలం 5 నిమిషాల ప్రదర్శన. ఇందుకోసం ఆమె రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుందట. ప్రియాంక గ్లోబల్ ఇమేజ్, ఇంటర్నేషనల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ వేడుక నిర్వహించిన జీ మీడియా.. ఆమె అడిగినంత మొత్తం ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. 
 
హంగామా త్వ‌ర‌లోనే టీవీలో ప్ర‌సారంకానుంది. ప్రియాంక రీసెంట్‌గా త‌న ఇన్‌స్ట్రాగ్రాంలో ఈ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కి సంబంధించిన రిహార్స‌ల్ వీడియోని షేర్ చేసింది. ఇందులో బ్యాక్ స్టేజ్ విశేషాల‌తో పాటు త‌న రిహార్స‌ల్‌కి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం క్వాంటికో 3 సీరియల్‌తో పాటు 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్', 'ఎ కిడ్ లైక్ జేక్' అనే హాలీవుడ్ సినిమాలను ఈ అమ్మడు చేస్తోంది.
 
 
 

Lights. Camera. Dance. #StageLife @zeecineawards @ganeshhhegde

A post shared by Priyanka Chopra (@priyankachopra) onWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#kalyanipriyadarshan : ఒక్క చిత్రంతోనే ఎలా వాడుకోవాలో తెలుసుకున్నా...

మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్, హీరోయిన్ లిజిల ముద్దుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. ...

news

దర్శకుడిని బూటు కాలితో తన్నిన అడిషినల్ డీసీపీ (వీడియో)

హైదరాబాద్ నగరంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిచిన ...

news

'లైంగిక వేధింపు'ల నటికి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది...

భావన.. మలయాళ నటి. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి', ...

news

బాల్‌ ఠాక్రే నాకు జీవితాన్నిచ్చారు : అమితాబ్ బచ్చన్ (వీడియో)

శివసేన అధినేత బాల్‌ ఠాక్రేపై బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ...

Widgets Magazine