Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పూరి మెహబూబాను నాలుగోసారి, ఐదోసారి థియేటర్లకు వెళ్లి చూస్తున్నారా?

బుధవారం, 16 మే 2018 (17:20 IST)

Widgets Magazine

పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మెహబూబా’. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకం పైన పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో రూపొందిన ‘మెహబూబా’ ఇటీవల రిలీజైంది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో థాంక్స్‌ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. 
puri jagannadh
 
ఛార్మి మాట్లాడుతూ... సినిమాకి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్‌. ఈ సినిమాకి అందరూ చాలా మంచి సపోర్ట్‌ అందించారు. ఇలాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. ఎందుకంటే సినిమాలోని విజువల్స్‌ని, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్‌ చెయ్యాలంటే బిగ్‌ స్క్రీన్‌లోనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ థియేటర్స్‌కి వెళ్ళి ‘మెహబూబా’ను చూడండి” అన్నారు.
 
పూరి ఆకాష్‌ మాట్లాడుతూ…సినిమాకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చూసినవాళ్ళంతా చాలా బాగుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాని ఎంతో ఇష్టంగా చేశారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాన్నకి థాంక్స్‌. ఆ పదం చాలా చిన్నదని నా ఒపీనియన్‌. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
 
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ…అమెరికాలో తెలుగు వాళ్ళ మధ్య కూర్చొని ప్రీమియర్‌ చూశాం. అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్‌లో థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 
 
నాలుగోసారి, ఐదోసారి చూసినవాళ్ళను కూడా నేను కలిశాను. ఆకాష్‌ని బాగా అప్రిషియేట్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌గా నేను తీసే సినిమాల్లా ఉండదు. కమర్షియల్‌ సాంగ్స్‌, ఐటమ్‌ సాంగ్స్‌ వంటివి లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే లవ్‌స్టోరీ చేశాను. నా కెరీర్‌లో నేను బాగా మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి అందరూ చూడండి. మా సినిమాకి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ బయోపిక్‌కు బ్రేక్.. వీవీవీతో బాలయ్య.. జోడీ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన ...

news

ఎన్టీఆర్ సినిమాలో రంభ.. అంతా త్రివిక్రమ్ ప్లాన్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతంలో సీనియర్ నటులను తన సినిమాల కోసం ఎంపిక చేసుకుంటున్న ...

news

'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అంటున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ...

news

25 రోజులు రూ.205 కోట్లు.. "భరత్ అనే నేను" కలెక్షన్స్...

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ ...

Widgets Magazine