శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (12:25 IST)

జూ.ఎన్టీఆర్ విలన్ గుండెపోటుతో కన్నుమూత

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. 
 
తన కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌తో పాటు, టీవీ సీరియల్స్‌లోనూ నటించిన ఆయన ఆ తర్వాత పలువురు అగ్రహీరోల చిత్రాల్లో ప్రతినాయకునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. నరేంద్ర ఝా 2002లో 'ఫంటూష్' అనే చిత్రం ద్వార బాలీవుడ్ వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత 'గదర్', 'రాయీస్', 'మొహంజోదారో' వంటి హిందీ చిత్రాల్లో నటించారు. 
 
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'యమదొంగ', యువరత్న బాలకృష్ణ చిత్రం 'లెజండ్', హీరో ప్రభాస్ నటించిన 'ఛత్రపతి', తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలీ' వంటి తదితర హీరోల చిత్రాల్లో నటించారు.

అలాగే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ చిత్రం 'రేస్-3'లో ఆయన విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. కాగా, ఝా మృతిపట్ల పలువురు నటీనటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.