Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నాకంటే పిచ్చోడివి కాబట్టే నిన్ను నమ్మాను' : కీరవాణికి వర్మ రీ ట్వీట్

మంగళవారం, 30 జనవరి 2018 (12:04 IST)

Widgets Magazine
mm - rgv

ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. కీరవాణి తనకంటే పిచ్చోడని వ్యాఖ్యానించారు. అందుకే క్షణక్షణం - అన్నమయ్య - బాహుబలి - గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించాడంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
తాజాగా రాంగోపాల్ వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) చిత్రానికి కీరవాణి సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రూపొందిన వీడియోకి కీర‌వాణి సంగీతం అందించ‌డ‌డం అంద‌రికి ఆశ్య‌ర్యాన్ని క‌లిగించింది. 
 
దీనిపై కీరవాణి స్పందిస్తూ, "జీఎస్టీతో న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించారు వ‌ర్మ‌. సెల్యులాయిడ్‌పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో వ‌ర్మ‌ తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు తాను సంగీతాన్ని అందించబోతున్నాను. ఇక నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి కృతజ్ఞతలు" అంటూ కీరవాణి రీసెంట్‌గా ట్వీట్‌ చేశారు. 
 
దీనిపై తాజాగా స్పందించిన వ‌ర్మ "నువ్వు నాకంటే పిచ్చోడివి కాబట్టే నేను నిన్ను నమ్మాను ఎందుకంటే నీలాంటి ఒక తెలివైన పిచ్చోడు మాత్రమే క్షణక్షణం - అన్నమయ్య - బాహుబలి - గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌కి జంప్ చేయగలడు" అని వర్మ రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను ...

news

ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ''సాహో'' తర్వాత.. త్రివిక్రమ్ సినిమాలో..

''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో ...

news

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. కీలుగుర్రం నుంచి కీరవాణి కాపీ కొట్టారట.. (video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా ...

news

అతనితో నటి సహజీవనం.. విభేదాల రాగానే వేధింపులంటూ ఫిర్యాదు...

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ముంబై పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనను ...

Widgets Magazine