శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మే 2020 (13:36 IST)

అండ్ ఇట్స్ అఫీషియల్ : రానా - మహీక నిశ్చితార్థం ముగిసింది!!

అండ్ ఇట్స్ అఫీషియల్... రానా దగ్గుబాటి - మహీకా బజాజ్ నిశ్చితార్థం ముగిసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో రానా దగ్గుబాటి - మహీకా నిశ్చితార్థం జరిగినట్టు తెలిపోయింది. 
 
నిజానికి రానా - మహీకాల నిశ్చితార్థం బుధవారం సాయంత్రం 4 గంటలకు ముగిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మర్యాదపూర్వకంగానే ఇరు కుటుంబాలు కలుస్తాయని రానా తండ్రి సురేష్ బాబు అన్నారు.
 
తాజాగా, రానా పోస్టు చేసిన ఫొటోల్లో ఆయన పంచెకట్టులో, మిహీకా పట్టుచీరలో కనపడ్డారు. ఈ రోజు రానా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే వారి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
 
ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కొద్ది కుటుంబ స‌భ్యుల మధ్య వారి నిశ్చితార్థం జరిగినట్లు టాక్. కాగా, వారి పెళ్లి డిసెంబ‌రులో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే సురేష్ బాబు తెలిపారు.