Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్థ సెంచరీ కొట్టిన 'రంగస్థలం'.. ఖుషీలో మిస్టర్ 'సి'

శుక్రవారం, 18 మే 2018 (11:22 IST)

Widgets Magazine

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై అర్థ సెంచరీ కొట్టింది. అంటే యాభై రోజులు పూర్తి చేసుకుంది. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం... తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను వసూళ్ల పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్‌ను ఈ సినిమా మరో మెట్టుపైన నుంచో బెట్టింది.
<a class=rangasthalam still" class="imgCont" height="500" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-03/08/full/1520522723-1676.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో సందడి చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత 'భరత్ అనే నేను' .. 'నా పేరు సూర్య' వంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినా, అవి 'రంగస్థలం' సినిమా వసూళ్లపై చూపించిన ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. 
 
వసూళ్ల పరంగా.. నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, రూ.120 కోట్లకి పైగా షేర్‌ను రాబట్టింది. కథ.. కథనాలు.. సంగీత సాహిత్యాలు.. చిత్రీకరణ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచి, ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ చిత్రాన్ని చూసిన అనేక ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
చలన చిత్రం కలెక్షన్లు రామ్ చరణ్ సుకుమార్ సమంత Celebrations రంగస్థలం Rangasthalam Movie Record Collections

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతార నటనకు అవార్డులు గ్యారంటీనా?

దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపువుంది. ముఖ్యంగా, లేడీ ఓరియంటెడ్ ...

news

ఆ ఒక్కటి కాకూడదని దేవుడిని ప్రార్థిస్తా... రకుల్

తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో కంటే ఇప్పుడు ...

news

సామి-2: చియాన్ విక్రమ్ స్టైల్ అదిరింది.. ఫస్టు లుక్ వీడియో మీ కోసం..

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్, త్రిష జంట‌గా న‌టించిన సామి సినిమా సంచలనం సృష్టించింది. ...

news

రంగమ్మత్తకు ఛాన్సులే ఛాన్సులు.. సచ్చిందిరా గొర్రె కోసం వెంకటలక్ష్మి వెయిటింగ్

''రంగస్థలం'' సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం తన కెరీర్‌ను స్మూత్‌గా ...

Widgets Magazine