బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:27 IST)

'రాయలసీమ లవ్ స్టోరీ' టీజీ వెంకటేష్ స్పీచ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్‌తో ప్రారంభమైంది ''రాయలసీమ లవ్ స్టోరీ''. కర్నూల్ లోని మౌర్యా ఇన్ హోటల్లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హీరో వెంకట్, హీరోయిన్లు హృశాలి, పావనిలపై టీజీ వెంకటేష్ క్లాప్‌నివ్వగా నర్వా రాజశేఖర్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్‌తో ప్రారంభమైంది ''రాయలసీమ లవ్ స్టోరీ''. కర్నూల్ లోని మౌర్యా ఇన్ హోటల్లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హీరో వెంకట్, హీరోయిన్లు హృశాలి, పావనిలపై టీజీ వెంకటేష్ క్లాప్‌నివ్వగా నర్వా రాజశేఖర్ రెడ్డి స్విచాన్ చేసారు. టీజీ వెంకటేష్ తనయుడు యువ నాయకుడు టీజీ భరత్ ఫస్ట్ షాట్‌కి  దర్శకత్వం వహించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ''ఇన్నాళ్లు రాయలసీమ కథలతో వచ్చిన సినిమాలన్నీ పగ, ప్రతీకారం అంటూ ఫ్యాక్షన్‌ని మరింతగా రెచ్చగొట్టేలా సినిమాలు వచ్చాయి కానీ రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు నిండైన మనసున్న వాళ్ళు అని చాటి చెప్పడానికి ముందుకు వచ్చిన దర్శకనిర్మాతలను నేను అభినందిస్తున్నాను.
 
ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళు ఎవరైనా కర్నూల్‌లో స్టూడియోలు కడతామని ముందుకు వస్తే ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహకరించడానికి మేమెప్పుడూ ముందుంటాం. పైగా అన్నిటికి అనువైన ప్రాంతం మా కర్నూల్ అంటూ దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు అందజేశాడు. 
 
నిర్మాతలు నాగరాజు, హుస్సేన్, ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ '' రామ్ రణధీర్ చెప్పిన కథ మాకు నచ్చడంతో వెంటనే సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం. అలాగే రామ్ రణధీర్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరింత సంతోషంగా ఉందన్నారు. 
 
దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ '' రాయలసీమ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే అవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు కానీ మా ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా విభిన్నమైన కోణంలో ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈరోజు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా మా సినిమా ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుండే జరుగుతుంది. కర్నూల్ నగరంలో పది రోజుల పాటు మొదటి షెద్యూల్ జరుగుతుంది. నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటాను. తప్పకుండా మా సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.