Widgets Magazine

'రాజుగారి గది 2'లో ఏముంది? రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (15:42 IST)

nagarjuna-samantha

రాజుగారి గది నటీనటులు: నాగార్జున, సమంత, రావు రమేష్, అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, నరేష్, శకలక శంకర్, అభినయ, నందు తదితరులు... సంగీతం: ఎస్.ఎస్ థమన్, కథ: రంజిత్ శంకర్, మాటలు: అబ్బూరి రవి నిర్మాతలు: పి.వి.పి, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓంకార్
 
హార్రర్ కామెడీగా రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన రాజుగారి గదికి సీక్వెల్‌గా ఈ శుక్రవారం నాడు విడుదలైన చిత్రం రాజుగారి గది2. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీ రోల్స్ పోషించారు. ఇకపోతే ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైన రాజుగారి గది 2లో కేవలం హీరో ఎమోషన్‌ను మాత్రమే నమ్ముకున్నట్లున్నాడు డైరెక్టర్. కామెడీ, హార్రర్ అంతగా రాణించలేదనే అనుకోవచ్చు. 
 
సెకండాఫ్ నుంచి కథ స్టార్ట్ అవుతుంది కనుక ఫస్టాఫ్ కామెడీతో నెట్టేద్దాం అని డైరెక్టర్ అనుకున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి తగినట్లుగానే వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్‌తో చేసిన కామెడీ సాగదీసి మరీ చేయించినట్లనిపిస్తుంది. అలా ముప్పావు గంట చిత్రం అయ్యాక నాగార్జున ఎంట్రీ అవుతాడు. ప్రేక్షకుడు కూడా అప్పుడే ఎంటర్ అయినట్లు ఫీలవుతాడు. నాగ్ పాత్ర మామూలుగా లేదు. ఎక్కడ కూడా బోర్ ఫీల్ కాకుండా చాలా స్ట్రాంగ్‌గా వుంటుంది నాగ్ క్యారెక్టర్. మెంటలిస్టుగా సూపర్బుగా నటించేశాడు నాగార్జున. ఇక సమంత నటించింది చిన్న పాత్రే అయినా ఎంతో ముఖ్యమైన పాత్ర అది. మిగిలినవారు తమతమ పాత్రల మేరకు నటించేశారు.
 
ఇక కథ విషయానికి వస్తే... ముగ్గురు ప్రాణ స్నేహితులు అశ్విన్(అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్(ప్రవీణ్)లు తమ స్నేహం ఎప్పటికీ అలాగే ఉండాలన్న ఆలోచనతో ముగ్గురు కలిసి ఉమ్మడిగా వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఇందుకు గాను విశాఖపట్టణం బీచ్‌లో ఉండే రాజుగారి బంగ్లా కొంటారు. ఈ బంగ్లాలో రిసార్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ రిసార్ట్‌కు సుహానిస (సీరత్ కపూర్) వస్తుంది. తొలిచూపులోనే ఆమెపై కిశోర్, ప్రవీణ్‌లు ప్రేమలో పడతారు. ఆమెకు దగ్గరయ్యేందుకు వారు చేసిన ప్రయత్నంలో వారికో ఓ భయంకరమైన అనుభవాలు కలుగుతాయి. 
 
ఆ అనుభవాలను బట్టి బంగ్లాలో దెయ్యం వుందని నిర్థారణకు వస్తారు. ఆ దెయ్యాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఓ చర్చి ఫాదర్ రుద్ర( నాగార్జున)ను కలుస్తారు. అతడు ప్రపంచంలోనే ది బెస్ట్ మెంటలిస్ట్‌లలో ఒకడిగా గుర్తింపు వుంటుంది. అలా బంగ్లాకు వచ్చిన రుద్రకు అమృత(సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్‌లో తిరుగుతుందని గుర్తిస్తాడు. ఐతే ఆమె ఆత్మ ఎందుకక్కడ వుంది? ఎలా చనిపోయింది? ఆమె ఆత్మను గుర్తించిన రుద్ర ఏం చేశాడు? చివరికి ఏమయిందన్నది మిగతా స్టోరీ. మొత్తమ్మీద చూస్తే రాజుగారి గది 2 చిత్రం కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా వుంది. సెకండాఫ్ నుంచి దర్శకుడు ఓంకార్ కథలో మంచి టెంపోతో తీసుకెళ్లాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Nagarjuna Movie Review Samantha Akkineni Telugu Cinema

Loading comments ...

తెలుగు సినిమా

news

శోభనానికి టైం దొరకడం లేదంటున్న హీరోయిన్... అంత బిజీగా వుందట...

ఇప్పటి ఆధునిక ప్రపంచంలో డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. అమ్మాయి-అబ్బాయి ఇష్టపడితే డేటింగ్ ...

news

కొడుకు జాతకం చూసి షాకైన పవన్... ఎందుకు?

పవన్ కళ్యాణ్‌‌కు కుమారుడు పుట్టిన తరువాత అతని జాతకం తెలుసుకుని పవన్ కళ్యాణ్‌ షాకయ్యాడట. ...

news

నాగార్జునతో సంబంధం ఉన్నట్టు గాసిప్ రాశారు... చదివి నవ్వుకున్నా : టబూ

తనపై వస్తున్న గాలివార్తలపై సీనియర్ నటి టబూ స్పందించారు. టబూ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' ...

news

సోమీ... ఆయన రామగోపాల వర్మ... ఆ తరువాత మీ ఖర్మ, పేలుతున్న కామెంట్స్

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రాంగోపాల్ వర్మ తీయడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ...

Widgets Magazine