బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2017 (12:19 IST)

పక్కనే కోడలుంది... బిహేవ్ యువర్‌సెల్ఫ్... యాంకర్ శ్యామలకు నాగ్ వార్నింగ్

యాంకర్ శ్యామలకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. విషయం ఏమిటంటే.. రాజుగారి గది 2 చిత్రం ప్రమోషన్లో భాగంగా యాంకర్ శ్యామల నాగార్జున-సమంతలను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ... సమంత అక్కినేనికి శుభాకాంక్షలు అని మొదలుపెట్

యాంకర్ శ్యామలకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. విషయం ఏమిటంటే.. రాజుగారి గది 2 చిత్రం ప్రమోషన్లో భాగంగా యాంకర్ శ్యామల నాగార్జున-సమంతలను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ... సమంత అక్కినేనికి శుభాకాంక్షలు అని మొదలుపెట్టి... నాగార్జున గారు మీరు మీసం ఎందుకు తీశారు అంటూ ప్రశ్నించింది. 
 
అంతేకాదు... మీసాలు వుంటే మీరు చాలా రొమాంటిక్‌గా వుంటారు అని అన్నది. దానికి నాగ్ సమాధానమిస్తూ, మీసాలు తీసేసినా బాగానే వున్నదని చాలామంది అంటున్నారు అని అన్నారు. ఆ తర్వాత... ఇంకా ఆ మీసాల గొడవ ఆపకుండా... మామగారు అయిన తర్వాత మీరు ఏజ్ తగ్గించుకునేందుకే మీసాలు తీస్తున్నట్లున్నారు అంటూ సెటైర్ విసిరింది. దీనితో నాగార్జునకు కోపం వచ్చేసింది. వెంటనే... పక్కనే కోడలుంది, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ శ్యామలకు మెత్తగా చురక అంటించారు.